రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు | 2 Indians Rescued From Libya To Return Home On Saturday | Sakshi
Sakshi News home page

రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు

Published Thu, Sep 22 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు

రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు

గతేడాది లిబియాలో ఉగ్రవాదులు చేతుల్లో కిడ్నాప్ కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు.

న్యూఢిల్లీ: గతేడాది లిబియాలో ఉగ్రవాదులు చేతుల్లో కిడ్నాప్ కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు.  అనంతరం వారు తమ  స్వగ్రామానికి చేరుకుంటారని  విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ప్రకటనలో తెలిపారు.

2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్,  శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరుపుతూనే ఉంది. వారి విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement