Two professors
-
‘పోలీసుల అదుపులో ఇద్దరు ప్రొఫెసర్లు’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకొని స్థానిక ఎమ్మార్వో ముందు బైండ్ ఓవర్ చేస్తున్నామని విశాఖ డీసీపీ - 1 రంగారెడ్డి అన్నారు. ఏయూ ఎంఎల్ఆర్ విభాగానికి చెందిన కె.రమేష్‌బాబుపై 498ఏ కేసుతో పాటు అక్రమ సంబంధం ఆరోపణలు ఉన్నాయని రంగారెడ్డి వెల్లడించారు. కాగా, 498 ఏ కేసు ఇంకా విచారణలోనే ఉందని ఆయన అన్నారు. సోషల్‌వర్క్ విభాగాధిపతి రాగాల స్వామిదాస్ విద్యార్థులు పట్ల ద్వందార్థ మాటలతో వేధిస్తున్నారని మీడియాలో కథనాలు రావటంతో సుమోటోగా తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇద్దరు ప్రొఫెసర్లను సీఆర్ పీసీ 41 /109 సెక్షన్ కింద అదుపులో తీసుకున్నామని తెలిపారు. ర్యాగింగ్ జరపకుండా కౌన్సిలింగ్ చేయాల్సిన ఆచార్యులే పోలీసులు, ఎమ్మార్వో కౌన్సిలింగ్ తీసుకోవటం దురదృష్టకరమన్నారు. అత్యున్నత సంస్థలో పనిచేసే వారు దిగజారి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రంగారరెడ్డి అన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని రంగారెడ్డి చెప్పారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే ఏయూ క్యాంపస్‌లో వర్చువల్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తామని రంగారెడ్డి తెలిపారు. వర్చువల్ పోలీసు స్టేషన్ ద్వారా ఏయూ విద్యార్థులు ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ వీసీతో కలసి పోలీసులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డీసీపీ రంగారెడ్డి అన్నారు. -
ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు
-
ఇంటికి చేరిన తెలుగు ప్రొఫెసర్లు
హైదరాబాద్: గతేడాది లిబియాలో ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్‌కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఏడాదిపాటూ ఐసిస్ కిడ్నాపర్ల చెరలో ఉన్న ప్రొఫెసర్ల విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు. విదేశాంగశాఖ అధికారులు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలను వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరిపి సఫలమయ్యింది. -
రేపు రానున్న తెలుగు ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ: గతేడాది లిబియాలో ఉగ్రవాదులు చేతుల్లో కిడ్నాప్ కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం వారు తమ స్వగ్రామానికి చేరుకుంటారని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ప్రకటనలో తెలిపారు. 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. నార్త్ లిబియాలోని సిర్టే యూనివర్శిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్ సమీపంలో వారు కిడ్నాప్ కు గురయ్యారు. వారిలోని కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను రెండురోజుల్లోనే వదిలేసిన ఉగ్రవాదులు.. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరామ కిషన్, శ్రీకాకుళం టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణలను మాత్రం చెరలోనే ఉంచారు. వారి విడుదలకోసం లిబియా దేశ రాయబారితో అప్పట్నుంచీ కేంద్రం చర్చలు జరుపుతూనే ఉంది. వారి విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు. -
‘యువభేరి’ ప్రొఫెసర్లపై కక్ష సాధింపు
- నేడు ఆంధ్రా వర్సిటీ బంద్‌కు పిలుపు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నినదించిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పతుండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో ‘యువభేరి’ సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదాను డిమాండ్ చేసిన ప్రసాదరెడ్డి, అబ్బులులకు ఏయూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా బుధవారం ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.