రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నినదించిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పతుండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది...
- నేడు ఆంధ్రా వర్సిటీ బంద్‌కు పిలుపు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నినదించిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పతుండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో ‘యువభేరి’ సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదాను డిమాండ్ చేసిన ప్రసాదరెడ్డి, అబ్బులులకు ఏయూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా బుధవారం ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.