గతేడాది లిబియాలో ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్కు గురై వారి చెర నుంచి బంధీలుగా విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఏడాదిపాటూ ఐసిస్ కిడ్నాపర్ల చెరలో ఉన్న ప్రొఫెసర్ల విడుదలలో కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించారు. విదేశాంగశాఖ అధికారులు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలను వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.