లిబియాలోని సభ నగరంలోని జైలు నుంచి దాదాపు 40 మంది ఖైదీలు పరారయ్యారని జైలు ఉన్నతాధికారి నాసర్ సబ్బాన్ వెల్లడించారు.
లిబియాలోని సభ నగరంలోని జైలు నుంచి దాదాపు 40 మంది ఖైదీలు పరారయ్యారని జైలు ఉన్నతాధికారి నాసర్ సబ్బాన్ వెల్లడించారు. ఆగంతకులు జైలుపై ముకుమ్మడిగా దాడి చేసి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం జైలులో ఉన్న ఖైదీలను విడిపించుకు పోయారని తెలిపారు.
అయితే భద్రత సిబ్బంది తెరుకునేలోపే ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. తప్పించుకు పారిపోయిన ఖైదీలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు తెలిపారు. ఆ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుందని వివరించారు.