బోటు ప్రమాదం: వలస వెళ్తున్న 8మంది మృతి | Migrant boat sinks off Libyan coast, 8 killed | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాదం: వలస వెళ్తున్న 8మంది మృతి

Published Mon, Apr 18 2016 8:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

Migrant boat sinks off Libyan coast, 8 killed

లిబియా : బోటు ప్రమాదంలో వలస వెళ్తున్న 8 మంది ఆఫ్రికా వాసులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన లిబియా తీరంలో ఆదివారం జరిగిందని శోధన, రెస్క్యూ సంస్థ సోమవారం తెలిపింది. ప్రమాదం నుంచి రెస్క్యూ బోటు ద్వారా 108 మందిని సురక్షితంగా కాపాడినట్లు మధ్యధరా ప్రాంత ఫ్రెంచ్ చారిటీ తెలిపింది. 
 
లిబియన్ పోర్టులోని సబ్రత నుంచి బయల్దేరిన ఈ నౌకలో మొత్తం 135 మంది ప్రయాణిస్తున్నారని, జనం ఎక్కువ కావడంతో ప్రమాదం సంభవించిందని సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికుడొకరు తెలిపారు. వీరిలో 8 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆరుగురి మృతదేహాలు వెలికితీశారు. మరో రెండు మృతదేహాలు గల్లంతయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement