ఉపాధి కోసం లిబియాకు వెళ్లిన భారతీయులు అక్కడ కష్టాలు పడుతున్నారు. గత రెండు రోజులుగా వారు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు.
న్యూఢిల్లీ : ఉపాధి కోసం లిబియాకు వెళ్లిన భారతీయులు అక్కడ కష్టాలు పడుతున్నారు. గత రెండు రోజులుగా వారు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ కంపెనీలో పనిచేసేందుకు వీరంతా లిబియాకు వెళ్లారు. రెండేళ్ల కాంట్రాక్ట్ తో వెళ్లిన భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. వీరిలో కర్నూలు జిల్లా బేతంచర్లకు చెందినవారే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు.