inidans
-
‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు?
భారతీయులు దీపావళి పండుగ కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా వేచిచూస్తుంటారు. ఆ రోజున భారతదేశం యావత్తూ దీపకాంతులతో నిండిపోతుంది. దీపావళి రోజున ఎక్కడ చూసినా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే మనం చేసుకునే దీపావళి లాంటి పండుగను యూదులు కూడా జరుపుకుంటారని మీకు తెలుసా? యూదులు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారో.. దీపావళికి ఇది ఎలా సరిపోలి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యూదులు జరపుకునే వెలుగుల పండుగ పేరు హనుక్కా. యూదులు దీనిని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ యూదులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఇజ్రాయెల్ అంతా కాంతులతో నిండిపోతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండుగ ఇజ్రాయిల్లో కేవలం ఒక్కరోజుతోనే ముగిసిపోదు. ఈ పండుగను యూదులు ఎనిమిది రోజులు ఆనందంగా జరుపుకుంటారు. హనుక్కా ఉత్సవ సమయంలో ప్రతి యూదు తమ ఇంటిలో 24 గంటలూ దీపాలు వెలిగిస్తాడు. యూదుల ఈ పండుగను మన దీపావళి తర్వాత అంటే డిసెంబర్లో జరుపుకుంటారు. యూదుల ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18 వరకూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఇజ్రాయెల్ యూదులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఉత్సవ సమయంలో ఎక్కడెక్కడి యూదులు సైతం వారి ఇళ్లకు చేరుకుని ఆనందంగా గడుపుతారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మనం దీపావళి జరుపుకున్నట్లే, యూదులు కూడా తమ విజయానికి గుర్తుగా హనుక్కా పండుగను జరుపుకుంటారు. నాటి రోజుల్లో క్రోబియన్ తిరుగుబాటు జరిగినప్పుడు గ్రీకు-సిరియన్ పాలకులకు వ్యతిరేకంగా యూదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విధంగా వారిని జెరూసలేం నుండి వెళ్లగొట్టారు. దీనికి గుర్తుగా యూదులు హనుక్కా ఉత్సవాన్ని చేసుకుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
లాక్డౌన్: గల్ఫ్ బాధితులకు శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ కారణంగా గల్ఫ్ దేశాలలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండియన్ నావీలను రంగంలోకి దించుతోంది. వివిధ గల్ఫ్ దేశాలలో దాదాపు 10 మిలియన్ల వరకు భారతీయులు ఉంటారని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాకుండా భారతీయులను గల్ఫ్ దేశాలనుంచి ఇండియాకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్ ఇండియా, ఇండియన్ నేవీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సంస్థలు ఎంత మందిని తరలించగలుగుతాయో ప్రణాళికలు ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ఇండియన్ నేవీ తమకు ఉన్న మూడు యుద్ధ నౌకల ద్వారా గల్ఫ్ దేశాల పోర్ట్ సిటీలలో ఉన్న వారిలో 1500 మంది వరకు తరలిస్తామని వెల్లడించింది. ( ‘దేవుడు కోరాడనే సాధువులను చంపేశా’ ) తమ దగ్గర 500 వరకు విమానాలు సిద్ధంగా ఉన్నాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది. గల్ఫ్ దేశాలలోని భారతీయులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వచ్చేనెల 3 తరువాత తరలింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నందున తరలింపు ఖర్చు ఎవరు భరించాలి అనే విషయంపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. -
లిబియాలో చిక్కుకున్న భారతీయులు
న్యూఢిల్లీ : ఉపాధి కోసం లిబియాకు వెళ్లిన భారతీయులు అక్కడ కష్టాలు పడుతున్నారు. గత రెండు రోజులుగా వారు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ కంపెనీలో పనిచేసేందుకు వీరంతా లిబియాకు వెళ్లారు. రెండేళ్ల కాంట్రాక్ట్ తో వెళ్లిన భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. వీరిలో కర్నూలు జిల్లా బేతంచర్లకు చెందినవారే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు.