21 సెప్టెంబర్ 1964 మాల్టా విముక్తి
ఆ నేడు
దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశం మాల్టా. ఇటలీకి దక్షిణం వైపు 80 కి. మీ దూరంలో, తునీషియాకు తూర్పున 284 కి.మీ దూరంలో, లిబియాకు ఉత్తరం వైపున 333 కి.మీ దూరంలో ఉంటుంది. విస్తీర్ణం 316 చ.కి.మీ. ప్రపంచంలోని అతి చిన్నదేశాలలో, అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో మాల్టా ఒకటి. రాజధాని వెల్లెట్టా. ఈ దేశ ప్రజలు మాల్టీస్, ఇంగ్లిషు భాషలు మాట్లాడతారు. మాల్టాకు క్రీ.పూ.5200 నాటి నుంచి చరిత్ర ఉంది.