Malta
-
అరేబియా సముద్రంలో నౌక హైజాక్ !
న్యూఢిల్లీ: మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. ఈ ఘటన జరిగినపుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెల్సుకున్న భారత నావికాదళాలు వెంటనే స్పందించి ఆ వైపుగా పయనమయ్యాయి. సముద్రపు దొంగలు ఆ నౌకను తమ అ«దీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధనౌక దానిని విజయవంతంగా అడ్డుకుంది. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాల్లో గురువారం ‘ఎంవీ రుయెన్’ నౌకను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరేట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్‌కు అత్యవసర సందేశం(మేడే)గా తెలియజేశారు. హైజాక్ విషయం తెల్సిన వెంటనే భారత నావికా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత గస్తీ విమానం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నావికాదళ యాంటీ–పైరసీ పెట్రోల్ యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. హైజాక్‌కు గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అటుగా దూసుకెళ్లి ఆ నౌకను శనివారం ఉదయం విజయవంతంగా అడ్డుకున్నాయి. ‘ రవాణా నౌకల సురక్షిత ప్రయాణానికి భారత నావికాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడూ ముందుంటుంది’ అని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. -
కారుబాంబు.. పొలాల్లో ముక్కలై పడిన జర్నలిస్టు
మాల్టా : పనామా కేసులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) అనే జర్నలిస్టును చంపేశారు. ఆమె ప్రయాణించే కారులో బాంబు పెట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి కారు వేసుకొని బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు పేలి పోవడంతో ఆమె దేహం విడిపోయిన భాగాలుగా పొలాల్లో పడిపోయింది. ఈ హత్య ఎవరు చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో పనామా కుంభకోణం ఓ కుదుపు కుదిపిన విషయం తెలసిందే. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి కూడా ఈ కుంభకోణం కారణంగానే ఊడిపోయింది. అలాగే, పలు అగ్ర దేశాల అధినేతలు సైతం ఈ కుంభకోణం ద్వారా వెలుగులోకి వచ్చారు. అలాంటి పనామా కేసులో గలిజియా విచారణ విభాగంలో మాల్టాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన భర్త పిల్లలతో కలిసి మోస్టా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం తన ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆమె కొద్ది సెకన్లకే బాంబు పేలుడుకు గురైంది. ఆమె కారుతో సహా ఎగిరిపోయి పొలాల్లో పడిపోయారు. ఆమె దేహం పూర్తిగా కాలి చిద్రమై పోయింది. ఆమె దుర్మరణంపట్ల మాట్లా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ సంతాపం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. కాగా, పనామా కేసు విచారణలో భాగస్వామురాలైన ఆమె ప్రధాని ముస్కాట్ భార్య, విద్యుత్‌శాఖ మంత్రి అక్రమంగా నిధులు పొందారని కథనాలు వెలువరించారు. -
'స్టార్‌వార్స్' రోబో క్రియేటర్ విషాదాంతం!
'స్టార్‌వార్స్' సినిమా కోసం ఆర్2-డీ2 రోబోలను రూపొందించిన స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు టోనీ డైసన్ విషాదకర పరిస్థితుల్లో మృతిచెందారు. గోజోకు చెందిన మాల్టా దీవిలోని తన నివాసంలో ఆయన విగతజీవిగా పోలీసులకు కనిపించారు. బ్రిటన్‌కు చెందిన 68 ఏళ్ల టోనీ డైసన్ సహజ కారణాలతోనే కొన్ని రోజుల కిందట చనిపోయినట్టు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా స్నేహితులకు ఆయన కనిపించకపోవడం, ఆయన ఆచూకీ లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటికి వెళ్లి చూడగా.. ఆయన ఒక్కడే నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆయన మృతి వెనుక ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు కలుగడం లేదని పోలీసులు తెలిపినట్టు స్థానిక మీడియా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించిన 'స్టార్‌వార్స్' సినిమాకు స్పెషల్ ఎఫ్టెక్స్ అందించడమే కాదు.. ఆ సిరీస్ సినిమాల కోసం ఎనిమిది ఆర్2-డీ2 రోబోలను రూపొందించారు. ఈ రోబోలు ఎంతగానో ఆయనకు పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. ఎన్నో ఇతర సంస్థలకు కూడా ఆయన రోబోలను రూపొందించి ఇచ్చారు. ఆయన రోబోలు ఎంతగా ఫేమస్ అయ్యాయంటే ఈ రోబోల పేరిట ఆయన క్లబ్ కూడా ఏర్పాటుచేశారు. -
21 సెప్టెంబర్ 1964 మాల్టా విముక్తి
ఆ నేడు దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశం మాల్టా. ఇటలీకి దక్షిణం వైపు 80 కి. మీ దూరంలో, తునీషియాకు తూర్పున 284 కి.మీ దూరంలో, లిబియాకు ఉత్తరం వైపున 333 కి.మీ దూరంలో ఉంటుంది. విస్తీర్ణం 316 చ.కి.మీ. ప్రపంచంలోని అతి చిన్నదేశాలలో, అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో మాల్టా ఒకటి. రాజధాని వెల్లెట్టా. ఈ దేశ ప్రజలు మాల్టీస్, ఇంగ్లిషు భాషలు మాట్లాడతారు. మాల్టాకు క్రీ.పూ.5200 నాటి నుంచి చరిత్ర ఉంది.