
మాల్టా : పనామా కేసులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) అనే జర్నలిస్టును చంపేశారు. ఆమె ప్రయాణించే కారులో బాంబు పెట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి కారు వేసుకొని బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు పేలి పోవడంతో ఆమె దేహం విడిపోయిన భాగాలుగా పొలాల్లో పడిపోయింది. ఈ హత్య ఎవరు చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో పనామా కుంభకోణం ఓ కుదుపు కుదిపిన విషయం తెలసిందే.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి కూడా ఈ కుంభకోణం కారణంగానే ఊడిపోయింది. అలాగే, పలు అగ్ర దేశాల అధినేతలు సైతం ఈ కుంభకోణం ద్వారా వెలుగులోకి వచ్చారు. అలాంటి పనామా కేసులో గలిజియా విచారణ విభాగంలో మాల్టాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన భర్త పిల్లలతో కలిసి మోస్టా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం తన ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆమె కొద్ది సెకన్లకే బాంబు పేలుడుకు గురైంది. ఆమె కారుతో సహా ఎగిరిపోయి పొలాల్లో పడిపోయారు. ఆమె దేహం పూర్తిగా కాలి చిద్రమై పోయింది. ఆమె దుర్మరణంపట్ల మాట్లా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ సంతాపం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. కాగా, పనామా కేసు విచారణలో భాగస్వామురాలైన ఆమె ప్రధాని ముస్కాట్ భార్య, విద్యుత్‌శాఖ మంత్రి అక్రమంగా నిధులు పొందారని కథనాలు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment