బెంగాజీ: లిబియాలో ఆత్మాహుతి దాడి జరిగి ఏడుగురు సైనికులు మృతి చెందారు. మరో పన్నెండు మంది గాయాలపాలయ్యారు.
బెంగాజీ: లిబియాలో ఆత్మాహుతి దాడి జరిగి ఏడుగురు సైనికులు మృతి చెందారు. మరో పన్నెండు మంది గాయాలపాలయ్యారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. లిబియాలోని బెంఘాజీ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఓ సైనికుల తనిఖీ కేంద్రం ఉందని, దానిని లక్ష్యంగా చేసుకొని వారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది దాడికి పాల్పడ్డాడని ఆర్మీ అధికారులు తెలియజేశారు.
దాడికోసం ఐఎస్ తీవ్రవాది ఆయుధాలతో నింపిన కారును ఉపయోగించడంతోపాటు తనను తాను పేల్చుకోవడం వల్ల భారీ పేలుడు చోటుచేసుకొని ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందన్నారు. దాడికి ముందే ఐఎస్ ఉగ్రవాదులు లిబియాలో సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడతాం అంటూ ట్విట్టర్లో ప్రకటించారు.