ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఆ ఇద్దరు | two indians still as hostage of isis | Sakshi
Sakshi News home page

ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఆ ఇద్దరు

Published Sat, Aug 1 2015 5:41 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

హైదరాబాద్ లోని బలరామ్ నివాసం వద్ద ఆందోళనలో కుటుంబ సభ్యులు - Sakshi

హైదరాబాద్ లోని బలరామ్ నివాసం వద్ద ఆందోళనలో కుటుంబ సభ్యులు

హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్కు గురైన భారతీయుల్లో ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. లిబియాలోని సిర్తేలో గత బుధవారం నలుగురు భారతీయులను బందీలుగా తీసుకెళ్లిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. శుక్రవారం రాత్రి ఇద్దరిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఉగ్ర చెరలోఉన్న తెలుగు పౌరులు గోపీకృష్ణ, బలరామ్ కిషన్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎప్పుడు విడుదలవుతారు? అనే విషయాలపై ఉత్కంఠ కొనసాగుతున్నది.

కిడ్నాపర్ల చెరనుంచి ఇద్దరి విడుదల సందర్భంగా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో మిగిలిన ఇద్దరిని కూడా విడిపించేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయాత్నాలు సాగాయి? ఫలితమేమిటి? అనే విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో హైదరాబాద్‌ లోని  చిలువేరు బలరామ్ కిషన్ నివాసంతోపాటు తిరువీధుల గోపీకృష్ణ కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.


కిడ్నాపైన నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా కిడ్నాప్ ఉదంతంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటనలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. 'ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో ఇండియా వ్యాపారం చేస్తోందా? ఇద్దరిమధ్యా ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది చర్చించుకునేందత దగ్గరితనం ఉందా?' అంటూ సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బందీలను విడిపించడం సుష్మా స్వరాజ్ చేతిలో వ్యవహారమైతే గతంలో కిడ్నాప్ కు గురై ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయిన 39 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement