kidnapers
-
అయినవారే ‘అదృశ్య’శక్తులు!
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం సోనీ కిడ్నాప్.. రెండు రోజులకు ముందు గజేందర్ అపహరణ.. నగరంలో ఇలా ఏదో ఓ చోట కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో కిడ్నాప్ కేసులు నమోదవుతుంటాయి. ఇటీవల డబ్బు కోసం జరుగుతున్న కిడ్నాపుల్లో 95 శాతం పరిచయస్తులే సూత్రధారులు. మంగళవారం కొలిక్కి చేరిన గజేంద్ర–అల్మాస్ వ్యవహారం ఈ కోవకు చెందినదే. ఇలాంటి కేసులు సిటీలో గరిష్టంగా 20 నుంచి 30 వరకు నమోదవుతుంటాయి. మిగిలిన కిడ్నాప్ కేసుల్లో అత్యధికం మైనర్ల మిస్సింగ్‌కు సంబంధించినవే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. చిన్నారులు అదృశ్య మైన సందర్భంలో కిడ్నాప్ కేసు నమోదు చేస్తుండటంతోనే ఈసంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. -
క్రాంతివీర్... కిడ్నాపర్!
సాక్షి, సిటీబ్యూరో: ఆ ఇద్దరూ రెండు నెలల్లో నగరంలో చిక్కిన అంతరాష్ట్ర నేరగాళ్లు... ఒకరు జూన్‌లో చిక్కిన హర్యానా గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా కాగా... మరొకరు ఇటీవల పట్టుబడిన ‘స్టార్ చోర్’ శర్థక్ రావు బబ్రాస్... వీరిద్దరిలోనూ ఉన్న ‘కొత్త కోణాలు’ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘరానా గ్యాంగ్‌స్టర్ నెహ్రా తానో విప్లవ నాయకుడిని అంటూ అక్కడి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులకు ఊదరగొడుతున్నాడు. మరోపక్క చోరీలు, స్టార్ హోటళ్ల బిల్లులు ఎగ్గొట్టే నేరాలకే పరిమితం అనుకున్న శర్థక్ గతంలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులోనూ నిందితుడిగా తేలింది. నేను క్రాంతివీర్... నాది సమాజసేవ... సైబరాబాద్, మియాపూర్ ఠాణా పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో హర్యానా ఎస్టీఎఫ్ పోలీసులకు గత నెల మొదటి వారంలో చిక్కిన మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న ఇతను బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టని విషయం తెలిసిందే. అక్కడి పోలీసుల నిఘా తప్పించుకునేందుకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గంగోత్రి, బెంగళూరు, హరిద్వార్, పుణే, హుగ్లీల్లో తలదాచుకుని చివరకు నగరంలో చిక్కాడు. ఇక్కడ ఉంటూనే చండీఘడ్‌లో ఉన్న తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడు. ఇతడిని అరెస్టు చేసిన తర్వాత హర్యానా ఎస్టీఎఫ్ అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే తానో క్రాంతివీర్ (విప్లవ నాయకుడు) అని, తానే చేసేది సమాజ సేవ అంటూ చెప్పుకొచ్చాడు. తాను చేసినవి నేరాలంటే అస్సలు ఒప్పకోవడం లేదు. ఇతడిని నేరబాట పట్టించిన లారెన్స్ బిష్ణోయ్ చేసిన బ్రెయిన్ వాష్ కారణంగానే సంపత్ ఇలా మారిపోయి ఉంటాడని ఎస్టీఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఇతడికి లండన్ నుంచీ నిధులు అందినట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. దీనిపై విచారణ జరపడానికి మరోసారి సిటీకి రావాలని భావిస్తోంది. మైనర్ కిడ్నాప్... కాటేజ్‌లో మకాం... అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చి దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో తన పంజా విసిరిన శర్థక్ రావు బబ్రాస్ను గోపాలపురం పోలీసులు గత వారం అరెస్టు చేశారు. బసేర హోటల్లో బస చేసి, అమర్సన్స్ పెరŠల్స్ అండ్ జ్యువెల్స్ యజమానిని మోసం చేసిన ఆరోపణలపై కటకటాల్లోకి పంపారు. పోర్ట్ బ్లేయర్లోని ఎంజీ రోడ్ ప్రాంతానికి చెందిన శర్థక్ రావు బబ్రాస్ ఉద్యోగం కోసం ముంబై వచ్చి నేరగాడిగా మారాడు. 2002 నుంచి వరుస పెట్టి అనేక స్టార్ హోటళ్లకు టోకరాలు వేస్తూ వచ్చాడు. 2014లో ఇతడిపై పోర్ట్ బ్లేయర్లోని ఫహ్రాగావ్ పోలీసుస్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన ఇతను ఆమెను అపహరించుకు వెళ్లి అక్కడి బునియదాబాద్లోని కృష్ణ కాంటినెంటల్ కాటేజ్‌లో ఉంచాడు. అప్పట్లో ఆ బాలికతో తాను ఇండియన్ నేవీలో ఉన్నతాధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఉత్తరాదికి మకాం మార్చి స్టార్ హోటల్స్‌కు టోకరా వేయడం కొనసాగించాడు. 2002 నుంచి 2012 వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినా అన్ని కేసుల్లోనూ జైలు శిక్షలు సైతం పూర్తి చేసుకున్నాడు. -
బీదర్‌లో అమానుషం...అనుమానంతో చంపేశారు
-
డాక్టర్ని కిడ్నాప్ చేసిన నిందితులు అరెస్ట్
విజయవాడ: నగరానికి చెందిన వైద్యుడు మాలెం పాటి వెంకటేశ్వరరావును కిడ్నప్ చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు గతం లో వెంకటేశ్వరరావు వద్ద కార్ డ్రైవర్ గా పని చేసిన కాకి విద్యాసాగర్ తన స్నేహితులు మూల్పూరు రంజిత్, డొక్కా నాగ దిలీప్, బెనర్జీలతో పాటు మరో మహిళతో కలిసి కిడ్నాప్‌కు వ్యూహం పన్నారు. ఒక మహిళను రోగిగా వైదుడు వెంకటేశ్వరరావు వద్దకు పంపి కిడ్నప్ చయాలనుకున్నారు. ఆమెను డాక్టర్ దగ్గరకు రోగిగా పంపించారు. ఆయనతో పరిచయం పెరిగాక గత నెల 28న నారాయణపురం కాలనీ లోని ఒక ప్లాట్ కి సదరు మహిళతో డాక్టర్ ను పిలిపించి శీతలపానీయంలో మత్తు మందు కలిపి కిడ్నాప్ చేశారు. వీరవల్లి లోని ఒక షెడ్ లో డాక్టర్ ను బంధించి, కుటుంబ సభ్యులు కు ఫోన్ చేసి 30 లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.డాక్టర్ కుటుంబ సభ్యుల ఫీర్యాదు మేరకు కేస్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ లు తెలిపారు. -
ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఆ ఇద్దరు
హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయుల్లో ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. లిబియాలోని సిర్తేలో గత బుధవారం నలుగురు భారతీయులను బందీలుగా తీసుకెళ్లిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. శుక్రవారం రాత్రి ఇద్దరిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఉగ్ర చెరలోఉన్న తెలుగు పౌరులు గోపీకృష్ణ, బలరామ్ కిషన్‌లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎప్పుడు విడుదలవుతారు? అనే విషయాలపై ఉత్కంఠ కొనసాగుతున్నది. కిడ్నాపర్ల చెరనుంచి ఇద్దరి విడుదల సందర్భంగా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో మిగిలిన ఇద్దరిని కూడా విడిపించేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయాత్నాలు సాగాయి? ఫలితమేమిటి? అనే విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో హైదరాబాద్ లోని చిలువేరు బలరామ్ కిషన్ నివాసంతోపాటు తిరువీధుల గోపీకృష్ణ కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. కిడ్నాపైన నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ ఉదంతంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటనలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. 'ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో ఇండియా వ్యాపారం చేస్తోందా? ఇద్దరిమధ్యా ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది చర్చించుకునేందత దగ్గరితనం ఉందా?' అంటూ సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బందీలను విడిపించడం సుష్మా స్వరాజ్ చేతిలో వ్యవహారమైతే గతంలో కిడ్నాప్ కు గురై ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయిన 39 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.