విజయవాడ: నగరానికి చెందిన వైద్యుడు మాలెం పాటి వెంకటేశ్వరరావును కిడ్నప్ చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు గతం లో వెంకటేశ్వరరావు వద్ద కార్ డ్రైవర్ గా పని చేసిన కాకి విద్యాసాగర్ తన స్నేహితులు మూల్పూరు రంజిత్, డొక్కా నాగ దిలీప్, బెనర్జీలతో పాటు మరో మహిళతో కలిసి కిడ్నాప్కు వ్యూహం పన్నారు. ఒక మహిళను రోగిగా వైదుడు వెంకటేశ్వరరావు వద్దకు పంపి కిడ్నప్ చయాలనుకున్నారు. ఆమెను డాక్టర్ దగ్గరకు రోగిగా పంపించారు.
ఆయనతో పరిచయం పెరిగాక గత నెల 28న నారాయణపురం కాలనీ లోని ఒక ప్లాట్ కి సదరు మహిళతో డాక్టర్ ను పిలిపించి శీతలపానీయంలో మత్తు మందు కలిపి కిడ్నాప్ చేశారు. వీరవల్లి లోని ఒక షెడ్ లో డాక్టర్ ను బంధించి, కుటుంబ సభ్యులు కు ఫోన్ చేసి 30 లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.డాక్టర్ కుటుంబ సభ్యుల ఫీర్యాదు మేరకు కేస్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ లు తెలిపారు.
డాక్టర్‌ని కిడ్నాప్ చేసిన నిందితులు అరెస్ట్
Published Sun, Jul 2 2017 4:11 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
Advertisement
Advertisement