చెక్పోస్టుపై దాడి : 17 మంది మృతి | 17 killed in attack on security check point in Libya | Sakshi
Sakshi News home page

చెక్పోస్టుపై దాడి : 17 మంది మృతి

Published Sat, Jan 3 2015 8:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

17 killed in attack on security check point in Libya

ట్రిపోలి: లిబియాలోని సుక్నా పట్టణంలో సెక్యూరిటీ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 17 మంది మరణించారు. మృతుల్లో 14 మంది భద్రత సిబ్బందితోపాటు ముగ్గురు పౌరులు ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రత సిబ్బంది అంతా 168వ ఆర్మీ బెటాలియన్కు చెందిన వారని తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఎవరు ప్రకటించలేదని చెప్పారు.

లిబియా రాజధాని ట్రిపోలికి దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఇటీవల కాలంలో లిబియాలో ఉగ్రవాదులు మరింతగా పేట్రేగిపోతున్నారు.గత వారం ట్రిపోలికి 150 కిలోమీటర్ల దూరంలోని సిర్తే పట్టణంలో పవర్ ప్లాంట్ వద్ద పహారా కాస్తున్న భద్రత సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement