వారంలో 700 మంది శరణార్థులు గల్లంతు! | 700 refugees displaced during the week! | Sakshi
Sakshi News home page

వారంలో 700 మంది శరణార్థులు గల్లంతు!

Published Mon, May 30 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

వారంలో 700 మంది శరణార్థులు గల్లంతు!

వారంలో 700 మంది శరణార్థులు గల్లంతు!

రోమ్: యూరప్‌కు సముద్ర మార్గంలో అక్రమంగా పడవల్లో తరలివస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి సంఖ్య తాజాగా 700కు చేరింది. శుక్రవారం సముద్రంలో శరణార్థులతో ఇటలీ తీరానికి వస్తున్న పడవ మునిగిన ఘటనలో 45 మంది మరణించారు. బుధవారం మరో పడవ మునిగిన ఘటనలో 100 మంది జాడ గల్లంతైందని ఐరాస శరణార్థుల హైకమిషనర్ అధికారప్రతినిధి కార్లొటా సమీ తెలిపారు.

బుధవారం లిబియా నుంచి చెరో 500 మంది ప్రయాణికులతో రెండు పడవలు ఇటలీకి బయల్దేరాయి. రెండింటినీ తాడుతో కట్టారు. అయితే, మార్గమధ్యంలో వెనక వైపు పడవ మునగడం ప్రారంభమవడంతో ముందు పడవ కెప్టెన్ తాడును కట్‌చేశాడు. దీంతో కిక్కిరిసిన శరణార్థులతో ఉన్న రెండో పడవ మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement