పడవ ప్రమాదం: 25 మంది మృతి | 25 migrants found dead in rubber boat in mediterranean sea | Sakshi
Sakshi News home page

పడవ ప్రమాదం: 25 మంది మృతి

Published Wed, Oct 26 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

పడవ ప్రమాదం: 25 మంది మృతి

పడవ ప్రమాదం: 25 మంది మృతి

రోమ్: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. లిబియా తీర ప్రాంతంలో వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురికావడంతో సుమారు 25 మంది మృతి చెందారు. ఫ్రెంచ్ సహాయక బృందం 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రమాదంలో 107 మందిని సహాయక బృందాలు రక్షించాయి. రబ్బర్ బోట్లో రసాయనాల మూలంగా కాలిన గాయాలతో కొందరు క్షతగాత్రులు ఉన్నారని,  వీరిని ఇటలీకి తరలించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బోట్ ఇంధనం లీక్ కావడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

ఉత్తర ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన సుమారు 3,500 మంది ఈ ఏడాది మృత్యువాత పడ్డారు. కిక్కిరిసిన బోట్లు సముద్రంలో తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement