మధ్యదరా సముద్రంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న శరణార్థులు (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : యూరోపియన్ యూనియన్‌ను చేరుకునేందుకు మధ్యదరా సముద్రంలో సాహస ప్రయాణం చేస్తూ ఇప్పటివరకూ 33 వేల మంది జల సమాధి అయినట్లు ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో విడుదల చేసింది. ప్రపంచంలోని సరిహద్దుల్లో అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక సరిహద్దుగా మధ్యదరా తీరాన్ని గుర్తించినట్లు చెప్పింది. 2000 నుంచి 2016 వరకూ మధ్యదరా మరణించిన శరణార్థుల వివరాలను శుక్రవారం వెల్లడించింది.
లిబియా నుంచి వచ్చే శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీతో యూరోపియన్ యూనియన్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కొంతమేర మరణాలను తగ్గించినట్లయిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎమ్) పేర్కొంది. అయితే, ఐక్యరాజ్యసమితి వెల్లడించిన మృతుల సంఖ్య వాస్తవానికి దూరంగా ఉందని యూరోపియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ అభిప్రాయపడ్డారు. మధ్యదరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటేనని తెలిపారు. 2017లో దాదాపు లక్షా 61 వేల మంది శరణార్థులు యూరోపియన్ యూనియన్‌కు వచ్చినట్లు ఐఓఎమ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment