భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత | Tensions rise as Indian, Pakistani armies clash | Sakshi
Sakshi News home page

భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత

Published Tue, Oct 7 2014 8:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

Tensions rise as Indian, Pakistani armies clash

జమ్మూ: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు రేఖ వద్ద భారత్, పాక్ భద్రత దళాల మధ్య మంగళవారం మరోసారి కాల్పులు జరిగాయి. దీంతో సరిహద్దు గ్రామాల్లోని వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పాక్ సైన్యం పూంచ్ జిల్లా బల్నోయ్ సెక్టార్లోని భారత స్థావరాలపై కాల్పులు జరిపినట్టు రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాల్పులకు దిగినట్టు తెలిపారు. భారత సైన్యం పాక్ దాడులను దీటుగా తిప్పికొడుతున్నట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement