కాస్‌గంజ్‌లో పెరిగిన ఉద్రిక్తత | clashes in uttar pradesh town after "tiranga bike rally" attacked, 1 dead | Sakshi
Sakshi News home page

కాస్‌గంజ్‌లో పెరిగిన ఉద్రిక్తత

Published Sun, Jan 28 2018 3:51 AM | Last Updated on Sun, Jan 28 2018 3:51 AM

clashes in uttar pradesh town after "tiranga bike rally" attacked, 1 dead - Sakshi

ఆందోళనకారులు నిప్పంటించిన బస్సులు

కాస్‌గంజ్‌: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌ పట్టణంలో గణతంత్ర దినోత్సవ ర్యాలీ సందర్భంగా రేగిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. శనివారం కూడా కొందరు ఆగంతకులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ బస్సు, మూడు దుకాణాలను, ఇతర వాణిజ్య సముదాయాలను తగలబెట్టారు. దీంతో పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్‌ (కర్ఫ్యూ) కొనసాగిస్తున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి 49 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో ఓ విద్యార్థి సంఘం చేపట్టిన తిరంగా ర్యాలీపై మరో వర్గం రాళ్లు రువ్వటంతో చందన్‌గుప్తా ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో వివాదం రేగింది. శనివారం గుప్తా అంత్యక్రియల అనంతరం ఓ వర్గం బస్సును తగులబెట్టగా.. ప్రత్యర్థి వర్గం దుకాణ సముదాయాలపై దాడులు చేసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని.. ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నామని యూపీ పోలీసు అదనపు డీజీ ఆనంద్‌ తెలిపారు. ఈ అల్లర్ల ఘటన దురదృష్టకరమని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement