వాషింగ్టన్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా పరిణమిస్తుందని, ఇది ఆఫ్ఘానిస్థాన్‌కు సంబంధించి పాక్ విధానాలపై ప్రభావం చూపుతుందని అమెరికా కాంగ్రెస్ కమిటీకి ఆ దేశ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ హౌస్ ఆర్మ్ సర్వీస్ కమిటీకి తెలిపారు. ఆఫ్ఘాన్ నుంచి సేనలను ఉపసంహరించడంతో పాక్, ఆఫ్ఘాన్‌లతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి అమెరికాకు అవకాశం దక్కిందని, తద్వారా రెండు దేశాల సరిహద్దుల్లో హింసకు పాల్పడుతున్న ఉగ్ర సంస్థల కట్టడి చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు.