మంగళూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత | The ongoing tension in Mangalore | Sakshi
Sakshi News home page

మంగళూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత

Published Tue, Dec 9 2014 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 6:13 PM

మంగళూరులో కొనసాగుతున్న  ఉద్రిక్తత - Sakshi

మంగళూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత

బెంగళూరు: ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వైషమ్యాలతో మంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం నగరంలోని ఓ వర్గం వారిని బంధించాలని.. మరో వర్గం వారు రోడ్డుకెక్కడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

నియంత్రణ కోల్పోయిన ఓ పోలీసు అధికారి ఓ వర్గ పీఠాధిపతిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి నగరంలో 144 సెక్షన్‌ను విధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement