చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం నుంచి సౌదీ అరేబియాలో మూడు రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సౌదీలోని చైనా గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు జిన్‌పింగ్ తన మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు గల్ఫ్ కింగ్‌డమ్‌కి చేరుకుంటారని సౌదీ మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో సౌదీ రాజు సల్మాన్ అధ్యక్షతన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఉంటుంది. దీనికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్‌సల్మాన్ హాజరవుతారని సౌదీ ప్రభుత్వ మీడియా నివేదికలో పేర్కొంది.
అలాగే ఆరుగురు సభ్యులతో కూడిన జీసీసీకి చెందిన పాలకుల శిఖరాగ్ర సమావేశానికి జిన్ పింగ్ హాజరవుతారని, పైగా మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల నాయకులతో కూడా సమావేశమై చర్చలు జరుపుతారని నివేదికలో వెల్లడించింది. జీసీసీ అనేది బహ్రెయిన్ , కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లతో కూడిన ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ రాజకీయ ఆర్థిక సంఘం. ఐతే ప్రస్తుతం జిన్‌పింగ్ సౌదీ రాక అమెరికాను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చమురు అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో సౌదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానించటం అనేది యూఎస్‌ని టెన్షన్‌కి గురి చేసే అంశమే. అదీగాక అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ మధ్య ప్రాచ్యాన్ని బీజింగ్‌కి అప్పగించదు అని తేల్చిన నేపథ్యంలో జరుగుతున్న జిన్‌పింగ్ పర్యటనే కావడం. అంతేగాక వాషంగ్టన్‌ని ప్రభావితం చేసే దేశాలతో లింక్ అప్ పెంచుకోవాలనే చైనా కోరికను తేటతెల్లం చేస్తోంది ఈ పర్యటన.
మరోవైపు సౌదీ ముడి చమురుకి సంబంధించి చైనా ఏ అతిపెద్ద కస్టమర్ కూడా. ఐతే ఈ పర్యటనలో సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురు నుంచి వైవిధ్యపరచాలనే ప్రిన్స్ మహ్మద్ ఆలోచనకు అనుగుణంగా మెగాప్రాజెక్టులలో చైనా సంస్థలు మరింతగా భాగస్వామ్యమయ్యేలా ఒప్పందాలపై ఇరు దేశాల నాయకులు చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2016లో సౌదీ అరేబియాను సందర్శించారు.
(చదవండి: సినీఫక్కీలో దోపిడీ: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల విలువైన కార్లను కొట్టేశారు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment