కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికా ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఉత్తరకొరియా ఆరోపించింది. అమెరికా దుశ్చర్యలకు ప్రతిగా వైట్‌హౌస్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని హెచ్చరించింది.
అమెరికాకు ఉత్తరకొరియా హెచ్చరిక
సియోల్: కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికా ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఉత్తరకొరియా ఆరోపించింది. అమెరికా దుశ్చర్యలకు ప్రతిగా వైట్‌హౌస్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని హెచ్చరించింది. ఉత్తర కొరియా మిలిటరీ జనరల్ పొలిటికల్ బ్యూరో డెరైక్టర్ వాంగ్‌ప్యాంగ్ సొ ఈ హెచ్చరిక చేశారు. 1950-53 కొరియా యుద్ధం ముగిసిన రోజును పురస్కరించుకుని ఆయన సైనికులనుద్దేశించి ప్ర సంగించారు.
అణ్వస్త్రాలతో కూడిన విమానవాహక నౌకను కొరియా తీరంలో మోహరించి అమెరికా, దక్షిణకొరియాతో కలిసి ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అమెరికా ఇదే ధోరణితో తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే వైట్‌హౌస్, పెంటగాన్‌లపై అణ్వాయుధ దాడి తప్పదని ఆయన అన్నారు.