న్యూఢిల్లీ: దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్.. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం(Indian High Commission) బుధవారం ప్రకటనల విడుదల చేసింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సి వచ్చిందని.. సమీక్ష అనంతరం తిరిగి ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు భారత హైకమిషన్ ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది.
ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ప్రమేయంలో భారత ఏజెంట్ల జోక్యం ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రత్యక్షంగా ఆరోపణలు ఇరు దేశాల మధ్య గ్యాప్ నెలకొంది. భారత్‌కు కెనడాకు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారం నుంచి వీసా సేవల్ని నిలిపివేసుకున్నాయి ఇరు దేశాలు.
Comments
Please login to add a commentAdd a comment