గణతంత్ర వేడుకలో ఉద్రిక్తత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గణతంత్ర వేడుకల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక ఖిల్లాలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధికారులు ఓ వర్గానికి శకటాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వ డం.. అందులో సదరు వర్గానికి చెందిన యువకులు చేసిన నినాదాలు మరో వర్గాన్ని రెచ్చగొట్టినట్లు ఉండడంతో వివాదానికి దారితీసింది. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరో పిస్తూ మరో వర్గం యువకులు ఆందోళనకు దిగారు. అన్నివర్గాల ప్రజలు పాల్గొనే జాతీయ పండుగ వేడుకలో ఒక వర్గానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తమకూ అనుమతి ఇవ్వాలంటూ ఆ వర్గానికి చెందిన యువకులు జెండాలతో ఖిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయ త్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కొంత అత్యుత్సాహం ప్రదర్శించడం.. అదే సమయంలో శకటాల ప్రదర్శన నిర్వహించిన యువకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. స్పందనగా మరోవర్గ యువకులూ పరస్పర నినాదాలతో ఖిల్లా ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో శకటాల ప్రదర్శన నిర్వహించిన యువకుల తోపాటు, ఆందోళనకు దిగిన మరోవర్గ యువకులనూ పోలీసులు ఖిల్లా నుంచి బయటికి పంపించేశారు. ఖిల్లా బయట ధర్నాకు దిగిన ఆందోళనకారులు ప్రభుత్వా నికి, అధికారులకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. చివరకు ఎస్పీ అనంతశర్మ వచ్చి ముందుగా వ్యతిరేక నినా దాలు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నిష్క్రమించిన ప్రజాప్రతినిధులు..!
శకటాల ప్రదర్శన జరిగిన వెంటనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వేడుకల మధ్యలో నుంచే వెళ్లిపోయారు. స్థానిక ఎస్సారెస్పీ అతిథిగృహంలో జిల్లా అభివృద్ధిపై విలేకరుల తో మాట్లాడారు. ఈ సందర్భంగా గొడవకు కారణమైన బాధ్యులపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎంపీ కవిత అధికారులను ఆదేశించినట్లు టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. దీనిSపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందిం చారు. ‘ఇది ప్రజాసామ్య దేశం.. ఓ వర్గానికి శకటాల ప్రదర్శనకు అను మతి ఎలా ఇచ్చా రు? అనుమతి ఇస్తే రెండు వర్గాలకు ఇవ్వండి. లేకుంటే ఎవరికీ ఇవ్వొద్దు’ అంటూ కలెక్టర్ శరత్, ఎస్పీ అనంతశర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ.. వేడుకల మధ్యలో నుంచి ఆయన కాలినడక ద్వారా తన ఇంటికి (3 కి.మీ) చేరుకున్నారు.