సియోల్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌పైకి ఆదివారం(జులై 21) ఉదయం నార్త్‌కొరియా మళ్లీ చెత్త బెలూన్లు ప్రయోగించింది.
సియోల్‌పై చెత్త బెలూన్లు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్త బెలూన్లకు ప్రతీకారంగా సరిహద్దులో లౌడ్‌స్పీకర్లతో ఉత్తరకొరియా నియంత కిమ్‌కు వ్యతిరేక ప్రసారాలు చేస్తామని సియోల్ హెచ్చరించింది.
చెత్త బెలూన్ల ప్రయోగంపై నార్త్ కొరియా స్పందించింది. కొంత మంది సౌత్ కొరియా పౌరులు బెలూన్ల ద్వారా నార్త్ కొరియాపైకి రాజకీయ కరపత్రాలు పంపడం వల్లే తాము చెత్త బెలూన్లు ప్రయోగించామని తెలిపింది.
ఇది కొనసాగితే రానున్న రోజుల్లో సౌత్‌కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నియంత కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. గతంలోనూ సౌత్‌కొరియాపైకి నార్త్‌కొరియా చెత్త బెలూన్లను ప్రయోగించింది.
Comments
Please login to add a commentAdd a comment