trash
-
రూ.5,900 కోట్ల విలువైన బిట్కాయిన్లు చెత్తకుప్ప పాలు!
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు. అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది. -
దక్షణ కొరియా రాజధాని సియోల్ లో అధ్యక్ష కార్యాలయంపై పడిన చెత్త బెలూన్
-
చెత్త పన్ను కొత్త రూపంలో..
సాక్షి, అమరావతి: చెత్త పన్ను రద్దుపై చంద్రబాబు సర్కారుది కపట నాటకమని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వం పట్టణాల్లోని ప్రజలపై చెత్త పన్ను వేసిందని, ఆ పన్నును రద్దు చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు అదే పన్నును మరో రూపంలో వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. పైగా, గత ప్రభుత్వం చెత్త సేకరణ వాహనాలు సమకూర్చిన 40 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే చెత్త పన్ను వసూలు చేయగా, ఇప్పుడ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 123 పట్టణాలు, కార్పొరేషన్లలో వసూలుకు రంగం సిద్ధం చేసింది. ఈమేరకు అన్ని పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. చెత్త పన్ను అని చెప్పకుండా, సరీ్వస్ ఛార్జీల రూపంలోనో, మరో రూపంలోనో ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవాలని సూచించింది. దీంతోపాటు రూ. 32 కోట్ల పాత బకాయిలు కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నాడు స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా..మున్సిపాలిటీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలకు, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇంటి నుంచి చెత్త సేకరించినందుకు స్థానిక సంస్థలు సేవా రుసుం వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ 2021 అక్టోబర్ 2న నాటి ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతి ఇంటికీ 3 చెత్త డబ్బాలు అందించి, వాటిలో వేసిన చెత్తను సేకరించేవారు. ఇందుకోసం 40 మున్సిపాలిటీల్లో 4 వేల చెత్త సేకరణ వాహనాలను సమకూర్చింది. ఇంటి నుంచి చెత్త సేకరణ, వాహనాల నిర్వహణకు అవి తిరిగే వార్డుల్లో నెలకు ఇంటికి రూ.30, వాణిజ్య సముదాయాలకు రూ.150 చొప్పున సేవా రుసుముగా నిర్ణయించారు. రద్దు చేసినట్లే చేసి.. కొత్త పన్నా?కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను బలవంతంగా విధిస్తోందని, ఎవరూ చెల్లించొద్దని పదేపదే చెప్పారు. అంతేగాక తాము అధికారంలోకి వచ్చాక ఆ పన్నును రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు బయటకు ప్రకటించారు. కానీ, చెత్త సేకరించినందుకు కొంత మొత్తాన్ని మున్సిపాలిటీలే సర్వీస్ చార్జీలు వసూలు చేసుకోవాలని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పురపాలక శాఖలోని ముఖ్యులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అంతేగాక చెత్త సేకరణ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు, వాహనాలకు 2023 సెప్టెంబర్ నుంచి చెల్లించాల్సిన రూ.32 కోట్లను మున్సిపాలిటీలే చెల్లించాలని, ఆ సొమ్మును కూడా ప్రజల నుంచే తీసుకోవాలని చెప్పడం గమనార్హం. చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించినందున, ఆ పేరుతో కాకుండా మరో రూపంలో వసూలు చేయాలని మున్సిపాలిటీలను ఆదేశించినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం మున్సిపాలిటీలకు చెల్లిస్తున్న ఏదో ఒక పన్నులో ఈ మొత్తాన్ని కలిపి వసూలు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్పైకి ఆదివారం(జులై 21) ఉదయం నార్త్‌కొరియా మళ్లీ చెత్త బెలూన్లు ప్రయోగించింది. సియోల్పై చెత్త బెలూన్లు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్త బెలూన్లకు ప్రతీకారంగా సరిహద్దులో లౌడ్‌స్పీకర్లతో ఉత్తరకొరియా నియంత కిమ్‌కు వ్యతిరేక ప్రసారాలు చేస్తామని సియోల్ హెచ్చరించింది. చెత్త బెలూన్ల ప్రయోగంపై నార్త్ కొరియా స్పందించింది. కొంత మంది సౌత్ కొరియా పౌరులు బెలూన్ల ద్వారా నార్త్ కొరియాపైకి రాజకీయ కరపత్రాలు పంపడం వల్లే తాము చెత్త బెలూన్లు ప్రయోగించామని తెలిపింది. ఇది కొనసాగితే రానున్న రోజుల్లో సౌత్‌కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నియంత కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. గతంలోనూ సౌత్కొరియాపైకి నార్త్‌కొరియా చెత్త బెలూన్లను ప్రయోగించింది. -
చెత్తకుప్పలో నవజాత ఆడశిశువు
నాగర్‌కర్నూల్ క్రైం: తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన నవజాత శిశువు చెత్తకుప్పలోకి చేరింది. కళ్లు తెరవని పసికందు చెత్తకుప్పల నడుమ ఆకలికేకలతో దర్శనమిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం శివారులోని గొల్లగేరి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తకుప్పల మధ్య ఆదివారం ఓ నవజాత ఆడశిశువు కన్పించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై విజయ్‌కుమార్ శిశువును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని, ఐదురోజుల ఆడశిశువుగా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, డంపింగ్‌యార్డులో శిశువు ను వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అమ్మో.. ఆత్మలతో కూడా మాట్లాడతారా?
చచ్చినోళ్లతో మాట్లాడడం.. అమ్మో! వింటేనే భయంగా ఉంది, అలాంటిది నిజంగా జరిగితే? అసలు అలా మాట్లాడాలంటే ముందు చనిపోయినవాళ్లను చూసి బతికి ఉన్నవాడి గుండె ఆగకుండా ఉండాలి! కొంతమంది మాత్రం తమకు ఆ ధైర్యం ఉందని, చనిపోయిన వారితో నేరుగా మాట్లాడతామని చెబుతుంటారు. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు దుర్హాం యూనివర్సిటీ ఒక పరిశోధన నిర్వహించింది. మానవ నాగరికత తొలినాళ్ల నుంచి మనిషికి అర్థం కాని సమస్యల్లో చావు ఒకటి. మనిషి విజ్ఞానం పెరిగే కొద్దీ అసలు మనమెందుకు పడుతున్నాం? ఎక్కడ నుంచి వస్తున్నాం? ఎందుకు చస్తున్నాం? ఎక్కడకు పోతాం? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డాడు. అయితే వీటికి సవ్యమైన సమాధానాలు దొరక్కపోవడంతో మతం ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రూపొందించుకున్నాడు. ప్రపంచంలో కీలక మతాలన్నీ మనిషి శరీరంలో ఆత్మ లేదా స్పిరిట్ లేదా సోల్ ఉంటుందని, మరణానంతరం అది ఇంకో జన్మనెత్తుతుందని భావిస్తాయి. ఇంతవరకు ఓకే కానీ, మత విశ్వాసాలు మరింత ముదిరేకొద్దీ మనిషిలో ఈ భావన చుట్టూ అనంతమైన ఊహలు రూపొందాయి. ఇలాంటి ఊహల్లో అతి ముఖ్యమైనది చనిపోయిన వాళ్లతో మాట్లాడడం. ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాల్లో ఈ భావన కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం? చనిపోయిన వారితో కాంటాక్ట్ చేయడం కుదిరేపనేనా? కేవలం చనిపోయిన మనుషులతో మాత్రమే మాట్లాడగలమా లేక చనిపోయిన ఇతర జీవజాలం ఆత్మలతో కూడా మాట్లాడవచ్చా? అనే అనుమానాలకు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం... మానవాత్మలు భూమిపైనే పరిభ్రమిస్తుంటాయా? వాటితో ఏ భాషలో సంభాషించాలి? అనేవాటిపై దుర్హాం యూనివర్సిటీలో తాజాగా ఒక పరిశోధన సాగింది. సాధారణంగా ఆత్మలతో మాట్లాడేవాళ్లను ’’మీడియం’’ అంటారు. ఇలాంటి 65 మంది మీడియంలను స్పిరిట్యువలిస్టు నేషనల్ యూనియన్ నుంచి, 143 మందిని మామూలు ప్రజల నుంచి పరిశోధన కోసం తీసుకున్నారు. వీరందరికీ ఆన్లైన్లో ప్రశ్నావళిని అందించారు. ఆత్మలతో ఎప్పుడు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఎలా మాట్లాడారు లాంటి ప్రశ్నలతో పాటు వారి వారి పారానార్మల్ నమ్మకాలు, ఊహలు, మానసిక స్థితి తదితర అంశాలను కూడా ప్రశ్నించారు. అనంతరం మీడియంలు ఇచ్చిన సమాధానాలను, మామూలు ప్రజల సమాధానాలతో పోల్చి పరిశోధించారు. ఆత్మలతో సంభాషణ ప్రతిరోజూ జరుగుతుందని మీడియమ్స్‌లో 79 శాతం చెప్పారు. ఈ సంభాషణ బహిరంగంగా జరగదని, తమ మెదడులోపలే జరుగుతుందని 65 శాతం మంది పేర్కొన్నారు. తమ గురించి బయటవారు ఏమనుకుంటారనేది పట్టించుకోమని ఎక్కువమంది తెలిపారు. ఇదే ప్రశ్నలకు మామూలు ప్రజలు తామెప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కోలేదని చెప్పారు. దీనిని బట్టి సాధారణ ప్రజలతో పోలిస్తే ఇలాంటి మీడియమ్స్ అంతా మానవాతీత ఊహాగానాల పట్ల, మానసిక చేతనలో అలౌకిక స్థితి పట్ల అతి నమ్మకం పెంచుకున్నవారని పరిశోధనలో తేలింది. అలాగే వారివారి జీవితానుభవాలు, బాల్యం, నమ్మకాలు, చుట్టూ వ్యక్తులు వారిని అతిగా ప్రభావం చేసినట్లు తేటతెల్లమైంది. ముఖ్యంగా బాల్యంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల ప్రభావం వల్ల వీరంతా ఇలా ఆత్మలతో మాట్లాడినట్లు భావిస్తున్నారని, అంతకుమించి వీరెవరూ నిజంగా ఎలాంటి మృతాత్మలతో సంభాషించలేదని పరిశోధన స్పష్టం చేసింది. -
‘నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడ్చారు’
భోపాల్: స్టాల్ ఏర్పాటు విషయంలో పోలీసులకు, ఓ సిక్కు వ్యక్తికి మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో నడిరోడ్డు మీద ఆ సిక్కు వ్యక్తి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఖాకీల తీరు పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ బర్వానీలోని రాజ్పూర్ తహసీల్‌లో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని జియానీ ప్రేమ్ సింగ్‌గా గుర్తించారు. వివరాలు.. బాధితుడు ఈ ప్రాంతంలో ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని భావించాడు. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో జియానీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు అతడి జుట్టు పట్టుకుని ఈడ్చారు. జియానీని కాపాడ్డానికి వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అవతలకు లాగి పడేశారు. (రూ. 100 ఇవ్వనందుకు.. అయ్యో పాపం!) ఈ క్రమంలో పోలీసులు తనను ఈడ్చుకెళ్తుండగా.. ‘వీళ్లు నన్ను కొడుతున్నారు. మమ్మల్ని చంపేస్తారు. పోలీసులు మా జుట్టు పట్టుకుని ఈడుస్తున్నారు. మేం స్టాల్ పెట్టుకోవడానికి వారు అంగీకరించడం లేదు’ అంటూ అరుస్తూ.. తమను కాపాడాల్సిందిగా చుట్టూ ఉన్న జనాలను కోరాడు జియానీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన జరిగినప్పుడు జియానీ తాగి ఉన్నడు. పోలీసులను అడ్డుకున్నాడు’ అని తెలిపారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. (చూస్తే పిచ్చోళ్లే.. కానీ అతి కిరాతకులు!) The incident took place in Rajpur Tehsil of Barwani after an argument broke out between the family of Giani Prem Singh Granthi and the police over setting up a stall in the area, police said he was drunk, two suspended @ndtvindia @ndtv pic.twitter.com/C6SudAS5cD — Anurag Dwary (@Anurag_Dwary) August 7, 2020 ఈ ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధితుడు గత కొంతకాలంగా పల్సూద్ పోలీస్ ఔట్‌పోస్ట్ దగ్గర తాళాల దుకాణం నడుపుకుంటున్నాడు. అతడిని నడిరోడ్డు మీద పోలీసులు అవమానించారు. అతడి తలపాగాను అపవిత్రం చేశారు’ అని మండిపడ్డారు. లంచం ఇవ్వడానికి నిరాకరించడంతోనే పోలీసులు తనపై దాడి చేశారని జియానీ ఆరోపించాడు. -
ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్‌కు సిద్ధమా?
ఎవరైనా చెత్తకుప్ప మధ్యలో కూర్చుని ఫొటోకి పోజిస్తారా? ఛీ ఛీ అంటూ ముక్కుమూసుకొని పారిపోతారు. కానీ అమెరికాలో వేలంవెర్రిగా వేలాదిగా కుర్రకారు చెత్తకుప్పల్లో ఫొటోలు దిగి ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు. ఫేస్బుక్లో యువతరం విసురుతున్న పిచ్చి చాలెంజ్‌లు ఎన్నెన్నో. బట్టలు శుభ్రంచేసేందుకు వాడే డిటర్జెంట్ ద్రవాన్ని తాగమనో, ఏకబిగిన ఒక గ్యాలన్(దాదాపు 4లీటర్ల) పాలు తాగాలనో, చెంచాడు దాల్చిన చెక్క పొడిని మింగాలనో ఇలా పిచ్చి చాలెంజ్లెన్నో సోషల్‌మీడియాలో పెరిగిపోయాయి. అయితే కొత్తగా వచ్చిన ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్‌కు వీటితో సంబంధమే లేదు. పూర్తి భిన్నం. యువతరానికి సామాజిక బాధ్యతను గుర్తుచేసే సరికొత్త ఆలోచనే ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్. మొట్టమొదటిగా బైరాన్ రోమన్ అనే వ్యక్తి మార్చి 5న చెత్తలో కూర్చుని ఉన్న ఒక వ్యక్తి ఫొటో ఫేస్బుక్లో పెట్టాడు. తర్వాత ఆ చెత్తనంతా శుభ్రంగా సంచుల్లోకి ఎత్తి అదే చోట వాటితో దిగిన మరో ఫొటోను ఫేస్బుక్లో పెట్టాడు. ఫేస్బుక్ ఖాతాలో ఫొటోలు పెట్టి ‘బోర్‌గా ఫీలవుతున్నారా? అయితే మీకోసం సరికొత్త చాలెంజ్ ఎదురుచూస్తోంది’ అంటూ యువతకు రోమన్ సవాల్ విసిరాడు. ఆ ఫొటోల్లో వ్యక్తి ఎవరు? అమెరికాలోని ఫీనిక్స్ సిటీకి చెందిన రోమన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల్లోని వ్యక్తి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఈ ఫొటోలు తొలిసారిగా హ్యాపీ టూర్స్ అనే సంస్థ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. గ్వాటెమాలాకు చెందిన ఈ సంస్థ సైట్లో మార్చి 4న ఈ ఫొటోలు కనిపించగానే రోమన్ వీటికి ఓ క్యాప్షన్ తగిలించి తన ఖాతాలో మార్చి 5న పోస్ట్చేశాడు. తమ సైట్లో ఆ ఫొటోలను ఎవరు పెట్టారో తమకూ తెలియదని హ్యాపీ టూర్స్ చెప్పిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. లక్షలాది యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. ఆ ఫొటోలు ఇప్పటికే 323,000 సార్లు షేర్ అయ్యాయి. వేలాదిగా కామెంట్లు వచ్చాయి. -
అంతా కట్టుకథ!
విజయనగరం టౌన్ : దివ్యాంగురాలిపై సామూహిక లైంగిక దాడి ఘటన కట్టుకథగా తేలింది. పూసపాటిరేగ మండలానికి చెందిన దివ్యాంగురాలిని నెల్లిమర్ల మండలం సారిపల్లికి వెళ్లే నిర్జన ప్రదేశంలో ఆటోడ్రైవర్ మరొక ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అదంతా దివ్యాంగురాలు అల్లిన కట్టుకథేనని తేలింది. ఈ మేరకు ఎస్పీ జి.పాలరాజు జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. దివ్యాంగురాలి లైంగిక దాడి కేసుకు సంబంధించి జిల్లాలోని ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, ఒక్కో బృందానికి భౌతిక ఆధారాలు, సాంకేతిక ఆధారాలు సేకరించాలని, కుటుంబ నేపథ్యం, శాస్త్ర, సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. బాధితురాలి కథనం ప్రకారం ఆమె ఆటో ఎక్కిన ప్రాంతాలను, సంఘటనా స్థలంగా చెప్పబడిన సారిపల్లిలోని నిర్జన ప్రదేశాన్ని సందర్శించారు. ఆమెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయిన తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ను మహిళా, శిశు సంక్షేమ అధికారుల సమక్షంలో నమోదు చేశారు. బాధితురాలు పట్టణంలో ఎక్కువ సమయం గడిపి ఇంటికి ఆలస్యంగా చేరడంతో కుటుంబ సభ్యులు తనను తిడతారని భావించి, పొంతన లేని విషయాలను చెప్పినట్టు నిర్ధారణ జరిగిందని ఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తు చేయడంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, విజిలెన్స్ మోనటరింగ్ సభ్యులు, మీడియా సభ్యులు, దళిత నాయకులు, పోలీస్ శాఖకు సహకరించారన్నారు. కేసు మిస్టరీని చేధించడంలో తీవ్రం గా శ్రమించిన డీఎస్పీలు టి.సౌమ్యలత, టి.త్రినాథరావు, ఎవి.రమణ, రూరల్ సీఐ దాసరి లక్ష్మణరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐలు రామకృష్ణ, ఉపేంద్ర, నారాయణరావు, ఇతర పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన అంశాలు సంఘటనా స్థలానికి ఆటో వెళ్లే అవకాశం లేదు. నెల్లిమర్లకు వెళ్లే అన్ని మార్గాల్లో సీసీ పుటేజీలలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. సంఘటన జరిగిన సమయాల ప్రకారం చూస్తే అవే సమయాల్లో బాధితురాలు పూర్తిగా విజయనగరం పట్టణంలోనే ఉన్నట్టుగా ఆమె ఫోన్ టవర్స్ రావడం. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్కు, వాస్తవ సంఘటనకు పొంతన లేకుండాపోవడం. బాధితురాలు ఫోన్, బ్యాగ్‌ను ఆటోలో విడిచిపెట్టినట్టుగా ముందుగా తెలిపినప్పటికీ, సదరు వస్తువులు ఆమె ఇంట్లోనే పోలీసు విచారణలో లభ్యం కావడంతో బాధితురాలు వాస్తవాలను అంగీకరించక తప్పలేదు. వైద్యులు బాధితురాలికి నిర్వహించిన పరీక్షలలో ఆమె శరీరంపై బాహ్యంగాగానీ, లోపలగానీ ఎటువంటి గాయాలు లేనట్టు ధృవీకరించారు. -
పరి పరిశోధన
ఉబ్బసం ఇబ్బందికి కారణం తెలిసింది... ఉబ్బసం సమస్య మొదలైనప్పుడు ఊపిరితిత్తుల్లోని గాలితిత్తులు ఎందుకు మూసుకుపోతాయో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీంతో ఉబ్బస వ్యాధి చికిత్సకు మరింత మెరుగైన మందులు తయారు చేయడం వీలవుతుందని అంచనా. హ్యూస్టన్ మెథాడిస్ట్కు చెందిన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇలా గాలితిత్తులు మూసుకుపోయేందుకు కేవలం రెండే రెండు పరమాణువులు కారణం. ఈ రెండింటినీ నియంత్రించగలిగితే ఉబ్బసం తీవ్రమైనప్పుడు ఊపిరి తీసుకునేందుకు విపరీతమైన ఇబ్బంది పడటం ఉండదు. గాలితిత్తుల ద్వారా ఒక రకమైన ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా జరగడం.. ఈ ప్రొటీన్ జిగురుగా ఉంటుందన్నది తెలిసిందే. ఊపిరితిత్తుల లోపలిగోడల్లో ఉండే కొన్ని ప్రత్యేక కణాలు గాలితిత్తులు ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే అవి జిగురులాంటి మ్యూసిన్ను ఉత్పత్తి చేస్తాయి. అయితే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన కొన్ని కణాలు ఊపిరితిత్తులు విడుదల చేసే ఓఎక్స్40 అనే రసాయనం కారణంగా మ్యూసిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మాయన్ల మహా నగరం బయటపడింది... సింధు నాగరికత గుర్తుంది కదా.. దక్షిణ అమెరికాలోనూ అచ్చం ఇలాంటిదే ఒక నాగరికత వేల ఏళ్ల క్రితం అకస్మాత్తుగా మాయమైపోయింది. అడపాదడపా ఒకట్రెండు నిర్మాణాలు, అవశేషాలు దొరికినప్పటికీ ఈ మాయన్ నాగరికత మర్మమేమిటో మాత్రం పూర్తిగా తెలియరాలేదు. ఇక ఈ సమస్యకు ఓ పరిష్కారం చిక్కినట్లే. ఎందుకంటారా? ఈ మధ్యే.. మాయన్లకు సంబంధించి గ్వాటమాలా వద్ద అత్యంత కీలకమైన ఆవిష్కరణ ఒకటి జరిగింది. అత్యాధునిక లిడార్ టెక్నాలజీ సాయంతో అమెజాన్ అటవీ ప్రాంతంలో భూగర్భంలో దాక్కున్న భారీ కట్టడాలను, మానవ ఆవాసాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము మొత్తం 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వైమానిక సర్వే లాంటిది చేశామని, క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి 900 ఏళ్ల కాలం నాటి మాయన్ల నాగరకతకు చెందిన మహా నగరం లభించింది. ఇది ఎంత పెద్దది అంటే.. సుమారు కోటిమంది నివసరించిన నగరం అని అంచనా వేస్తున్నారు. మునుపటి అంచనాల కంటే చాలా ఎక్కువగా మాయన్లు అటవీభూమిని వ్యవసాయం కోసం చదును చేశారని, సాగునీరు కోసం కాలువల వంటి ఏర్పాట్లు విస్తృతంగా వాడారని టులాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై రెండు లక్షల టన్నుల చెత్త! భూమ్మీద ఇప్పటికే చెత్త సమస్యను సృష్టించుకున్న మనిషి జాబిల్లిని కూడా వదల్లేదు. ఎప్పుడో భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకుంటామని నాసా చెబుతోంది కానీ.. ఇప్పటికే అక్కడ కూడా బోలెడంత చెత్త పేరుకుపోయిందట. నాసా అంచనాల ప్రకారం.. ఇప్పటివరకూ జాబిల్లిపైకి వెళ్లిన ఉపగ్రహాలు, మానవ ప్రయాణాలను కలిపి చూస్తే మొత్తం రెండు లక్షల టన్నుల చెత్త అక్కడ ఉంది. జాబిల్లిపైకి వెళ్లేందుకు వాడిన రాకెట్లు, ఉపగ్రహాల్లో అత్యధిక భాగాన్ని అక్కడే వదిలి వేయడం వల్ల ఈ సమస్య వస్తోన్నట్లు అంచనా. వ్యోమగాములను భూమ్మీదకు తిరిగి తీసుకొచ్చేందుకు ఇది చౌకైన మార్గమని ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు అనుకునేవారు. జాబిల్లిపై తిరిగేందుకు ఉపయోగించిన మూన్ల్యాండర్లు, ఇతర ఉపగ్రహ విడిభాగాలు, మానవ వ్యర్థాలతోపాటు అపోలో 15 వ్యోమగాములు వదిలిన అల్యూమినియంతో చేసిన జ్ఞాపికల వంటివన్నీ ఇక్కడే ఉండిపోయాయి. అప్పట్లో జాబిల్లిపై చేరిన వ్యోమగాములు అక్కడ గోల్ఫ్ ఆడారు. ఆ తరువాత గోల్ఫ్ బంతులతోపాటు ఇతర సామగ్రిని కూడా అక్కడే వదిలేశారు. భూమి చుట్టూ అంతరిక్షంలో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్ చెత్తకు జాబిల్లి ఉపరితలంపై ఉన్న చెత్త అదనం అన్నమాట! -
‘చెత్త’ గోడుకు ‘గోడ’ విరుగుడు
సాక్షి, హైదరాబాద్ : జనావాసాలకు చేరువగా ఉండే రైలు పట్టాలు చెత్తాచెదారంతో నిండి ఉండటం కనిపిస్తూనే ఉంటుంది. ట్రాక్‌కు చేరువగా ఉండే వారు ఇళ్లల్లోని చెత్తను పట్టాలపై వేస్తుండటంతో పెద్దమొత్తంలో చెత్త పోగై పట్టాలు అసహ్యంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అంటూ పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. పట్టాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్న రైల్వే బోర్డు.. ‘గోడ’పరిష్కారాన్ని కనుగొంది. జనావాసాలు ఉన్న చోట పట్టాలకు రెండువైపులా కాంక్రీట్ గోడలు నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే జోనల్ రైల్వే అధికారుల సూచనలు బోర్డు స్వీకరించగా.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులూ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అడ్డుగోడలే పరిష్కారమని.. చాలా చోట్ల పట్టాలను ఆనుకుని పేదలు తాత్కాలిక ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల మురికివాడలున్నాయి. సాధారణ కాలనీల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. మురికివాడలపై అంతగా దృష్టి లేదు. దీంతో ఇళ్లల్లోని చెత్తను రైల్వే పట్టాల వెంట స్థానికులు డంప్ చేస్తున్నారు. వీటిల్లోని ప్లాస్టిక్ సంచులు గాలికి కొట్టుకొచ్చి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్నాయని సిబ్బంది ఫిర్యాదు చేస్తున్నారు. ఆ సమస్య కన్నా కూడా రైల్వే స్థలాలు అత్యంత అసహ్యంగా కనిపిస్తుండటమే పెద్ద సమస్యగా మారింది. స్థానికుల్లో అవగాహన కోసం గతంలో అనేక సార్లు రైల్వే శాఖ యత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అడ్డుగోడలు నిర్మించడమే సమస్యకు పరిష్కారంగా నిర్ణయించారు. తొలుత ఇనుప మెష్‌లు.. తొలుత ఇనుప మెష్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దాన్ని చోరీ చేసే అవకాశాలుండటంతో విరమించుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో కాంక్రీట్ గోడ నిర్మించాలనుకుంటున్నారు. కానీ.. అవసరమైన నిధులు విడుదల చేయక ఎన్నో రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న తరుణంలో గోడ కోసం భారీగా వ్యయం ఏంటని విమర్శలొస్తున్నాయి. అయితే స్వచ్ఛభారత్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తున్నందున గోడ నిర్మాణానికే రైల్వే శాఖ మొగ్గు చూపుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ‘ట్రాక్ పొడవునా గోడ ఉండదు. ఇళ్లు చేరువగా ఉన్న చోటే నిర్మిస్తారు. ఇది భారీ వ్యయం కాకపోవచ్చు’అని ఓ రైల్వే అధికారి అన్నారు. నిర్మించినా సాధ్యమా?.. గోడ నిర్మించినా సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కవర్లలో చెత్త మూటగట్టి గోడపై నుంచి ట్రాక్ వైపు గిరాటేసే అవకాశం ఉందని వాదన. అయితే గోడ ఎత్తుగా ఉండనున్నందున అన్ని చోట్లా చెత్త కవర్లు ఎత్తేసే అవకాశం ఉండదని, సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ పరిధిలోని ‘ది రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’గోడ నిర్మాణ నమూనాలూ సిద్ధం చేసిందని, దీనికి రైల్వే బోర్డు పచ్చజెండా ఊపిందని చెబుతున్నారు. -
తెగిపడ్డ..నింగి చుక్క!
♦ కాకులు బొడ్డు పొడుస్తున్నాయి.. ♦ పసిగుడ్డు గుక్కపెట్టింది.. ♦ స్పందించిన హృదయాలు ♦ హుటాహుటిన రిమ్స్‌కు తరలింపు తెగిపడ్డా నింగి చుక్కనా.. చెత్త కుండి కాడ కుక్కనా.. ఏ తల్లి కన్నా బిడ్డనో.. నేను ఏ అయ్యా కన్నా కొడుకునో.. కాలు జారిన తల్లి ఎవరో.. కండ కావరమెక్కిన తండ్రి ఎవరో కరుణ లేని ఓ తల్లిదండ్రులారా.. నమ్మించి నన్నేలా గొంతెట్ల కోశారు.. తెగిపడ్డా నింగి చుక్కనా.. చెత్తకుండి కాడా కుక్కనా? ఒంగోలు టౌన్ : ఆ శిశువు భూమిపై పడి గంటలు కూడా కాలేదు. శరీరంపై రక్తపు మరకలు కూడా పోలేదు. తల్లి ఒడిలో వెచ్చగా ఉండాల్సిన శిశువు ఒంటరిగా నేలపై పడి ఉంది. కన్నతల్లి మాతృత్వ బంధాన్ని తెంచుకొని వదిలేసి వెళ్లింది. కళ్లు కూడా సరిగా తెరవని ఆ శిశువుపై కాకులు వాలాయి. వాటి ముక్కుతో శిశువు బొడ్డు పొడుస్తున్నాయి. కళ్లు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆ శిశువు గుక్కపెట్టి ఏడ్చింది. అదే సమయంలో సమీపంలోని వ్యక్తి ఇంటి నుంచి ఇన్స్టిట్యూట్కు వెళ్తుండగా పసికందు ఏడుపు వినిపించింది. హుటాహుటిన తన భార్య, చుట్టుపక్క వాళ్లను పిలిచి ఆ శిశువును రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఒంగోలులోని భాగ్యనగర్ రెండో వీధిలోని చిన్న గొందిలో జరిగింది. ఏం జరిగిందంటే..? అప్పుడే ప్రసవించిన ఒక మహిళ తన పేగు తెంచుకొని పుట్టిన మగ బిడ్డకు రక్తపు మరకలు కూడా తుడవకముందే అలాగే వదిలేసి వెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో ఆమెను ఎవరూ గమనించలేదు. ఆ శిశువు కళ్లు కూడా తెరిచే స్థితిలో లేడు. తల్లి ఒడిలో ఉన్నట్లుగానే భావించి అలాగే ఉన్నాడు. అయితే శిశువు శరీరంపై రక్తపు మరకలు ఉండటాన్ని కాకులు గమనించాయి. క్షణాల్లో అక్కడకు చేరుకొని ఆ శిశువు బొడ్డును పొడవడం మొదలుపెట్టాయి. భీత్తిల్లిన ఆ శిశువు పెద్దగా ఏడవడంతో అదే సమయంలో సమీపంలో నివసిస్తున్న పసుమర్తి రంజిత్‌కుమార్ అనే వ్యక్తి మధ్యాహ్న భోజనం ముగించుకొని తన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కు బయల్దేరేందుకు బయటకు వచ్చాడు. శిశువు ఏడుపు వినిపించడంతో వెంటనే తన భార్య కానుకను కేకలు వేసి పిలిచాడు. భార్యాభర్తలిరువురూ హుటాహుటిన శిశువు ఏడుపు వినిపిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే రిమ్స్‌కు తరలించారు. విషయాన్ని ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియకు చెప్పడంతో ఆమె ఆ వెంటనే రిమ్స్‌కు చేరుకున్నారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్నారు. బిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శిశువు విషయాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. -
ఫుట్ బాల్ కోసం ఇల్లు పీకి పందిరేశాడు!
యూరో కప్-2016 మ్యాచ్ ను ఆసక్తిగా తిలకిస్తున్న భర్తను భార్య టీవీ అస్తమానం ఆఫ్ చేస్తూ విసిగించింది. అంతే చిర్రెత్తుకొచ్చిన అతను ఏం చేశాడంటే.. టర్కీతో క్రోయేషియా ఆడుతున్న మ్యాచ్ ను తిలకిస్తున్న ఇజ్జెట్ సాల్టీని అతని భార్య ఒక్కసారిగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. సహనాన్ని కోల్పోయిన అతను ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని పెద్దగా అరిచాడు. దీంతో రేవేంజ్ తీసుకోవడానికి ఆమె టీవీని ఆఫ్ చేయడానికి నిర్ణయించుకుంది. రూమ్ నుంచి బయటకు వెళ్లే ముందు కెమెరాను గదిలో అమర్చింది. గది నుంచి బయటకు వెళ్లి సరిగ్గా గోడకు అవతల ఉన్న స్థలంలో టీవీ ఆఫ్ చేసేందుకు తన ఫోన్ లోని రిమోట్ అప్లికేషన్ ను ఉపయోగించుకుంది. ఆట మంచి రసవత్తరంగా సాగుతున్నప్పుడు, కరెక్ట్ గా ఇక గోల్ వేస్తున్నాడు అన్నప్పుడు, పోల్ నుంచి ప్లేయర్ గోల్ పోస్ట్ మీదకు బాల్ ను తన్నినపుడు టీవీని ఆఫ్ చేస్తూ .. ఆన్ చేస్తూ అతన్ని ఏడిపించింది. టీవీ అలా వస్తూ ఆగిపోతుండటంతో అర్ధంకాని అతను గదిలో ప్రతి ఇంచ్ ను వెతికాడు. ఏం అర్ధంకాకపోవడంతో తీవ్రంగా అసహననానకి లోనయ్యాడు. ఆ తర్వాత కూడా అంతే జరుగుతుండటంతో తట్టుకోలేక ముందున్న ల్యాప్ టాప్ ను తీసి టీవీ మీదకు విసిరేశాడు. అక్కడితో ఆగకుండా టీవీని కాలి తన్నాడు. దిండు, తినే చిప్స్ ను గాల్లోకి విసిరేశాడు. కింద పడిపోయన ల్యాప్ టాప్ ను తీసుకుని రెండుగా విడగొట్టి మళ్లీ మళ్లీ కిందేశాడుకాఫీ టేబుల్ ముందు ఉమ్మాడు. కాగా, ఈ మ్యాచ్ లో టర్కీ 1-0 తేడాతో ఓడిపోయింది. -
వాళ్లను పోలింగ్ బూత్ నుంచి తరిమికొట్టండి!
పశ్చిమ బెంగాల్: ప్రత్యర్ధి పార్టీ నాయకులను పోలింగ్ బూతుల నుంచి బయటకు లాగి చితక్కొట్టాలని కార్యకర్తలకు ఫోన్ ద్వారా చెప్తూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి సోనాలి గుహా చిక్కుల్లో పడ్డారు. సత్గాచియా ప్రాంతంలోని పోలింగ్ బూతులో ఈవీఎం సరిగా పనిచేయడం లేదంటూ ఆమె ఈసీకి చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో పోలింగ్ బూతులోకి ఆమె వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డగించడంతో ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మమత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన సోనాలీ.. సీపీఎం వాళ్ల వల్లే ఈవీఎం పగిలిపోయిందని, వాళ్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు ఈడ్చి తరిమికొట్టాలని ఫోన్ లో కార్యకర్తలకు చెప్పారు. ఓటర్లందరూ తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనాలి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది. సోనాలిపై కేసు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
ఇంకా నీటిలోనే నెల్లూరు
-
నెల్లూరులో భారీ వర్షాలకు ఆరుగురు మృతి
-
చెత్తకుప్పలో మృత శిశువు
ఒక రోజు వయసున్న మగ శిశువు మృత దేహాన్ని చెత్తకుప్ప పాలు చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మునిసిపాలిటీ అడ్డగుట్టపల్లిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ చెత్తకుప్పలో శిశువు మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. -
చెరిపేయండి... శాశ్వతంగా!
పీసీలోంచి ఫైళ్లు తొలగించాలంటే మీరు ఏం చేస్తారు? ఆ... ఏముంది.. ట్రాష్‌లో పడేస్తేసరి అంటున్నారా? బాగానే ఉంటుంది కానీ దీనిద్వారా ఫైల్ పూర్తిగా తొలగిపోదు!! హార్డ్డ్రై వ్‌లో ఎక్కడో ఓ మూలన అలాగే పడి ఉంటుంది. కాలం గడిచేకొద్దీ ఇలాంటి చెత్త అంతా పేరుకుపోయి... పీసీ నత్తనడకన నడవడం మొదలవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎంచక్కా ఈ పద్ధతులు పాటించండి! ట్రాష్‌లో పడేసి, క్లీన్ చేసిన ప్రతిసారి హమ్మయ్యా.. కొంత చెత్త వదిలించుకున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన పని సగమే అయినట్లు లెక్క. ఎందుకంటే ట్రాష్‌ను క్లీన్ చేసినప్పుడు ఫైల్ తాలూకూ వర్చువల్ పాథ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఫైల్ అలాగే స్టోర్ అవుతుంది. కొంచెం కష్టమైనప్పటికీ వీటిని మళ్లీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. మామూలు ఫైళ్ల విషయంలో ఫర్వాలేదేమోగానీ.... సున్నితమైన వివరాలున్న ఫైళ్ల విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం. ఈ సమస్యను అధిగమించేందుకు అదే ఫైల్‌పై మళ్లీ సమాచారాన్ని స్టోర్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఇది చేతులతో చేసే పని కాదు. మార్కెట్లో ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటివి ఏమేమి ఉన్నాయో, అవెలా పనిచేస్తాయో చూడండి... ఇరేజర్... ఈ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తరువాత డిలీట్ చేయాల్సిన ఫైల్‌పై రైట్ క్లిక్ చేస్తే చాలు... కనిపించే ఆప్షన్లలో ఇరేజర్ ఐకాన్‌ను ఎంచుకోవడం ద్వారా ఫైల్‌ను శాశ్వతంగా చెరిపేయవచ్చు. ఒక్కో ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ట్రాష్‌లో పడేసే ప్రతిఫైల్‌ను ఇలా ఓవర్‌రైట్ చేసి డిలీట్ చేసేలా ఇరేజర్ను ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సీసీ క్లీనర్... దీని గురించి మీరు వినే ఉంటారు. హార్డ్‌డిస్క్‌లో స్పేస్‌ను ఆదా చేసేందుకు తరచూ వాడే సాఫ్ట్వేర్ ఇది. సాధారణ పద్ధతుల్లో ఫైళ్లను డిలీట్ చేసిన తరువాత వాటిని గుర్తులను చెరిపేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్. పీసీలో నిర్దిష్టంగా ఫలానా ప్రాంతాల్లోని అనవసరమైన ఫైళ్లను ఓవర్‌రైట్ చేయమని సూచించే అవకాశం ఉంటుంది సీసీక్లీనర్ సాఫ్ట్‌వేర్‌తో. దీంట్లోనూ ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. సోర్స్ ఎమ్టీ ట్రాష్.. ఈ సాఫ్ట్వేర్ ఆపిల్ కంప్యూటర్ల కోసం ఉద్దేశించింది. కొనుక్కున్నప్పుడే ట్రాష్ బిన్‌కు అనుసంధానంగా ఏర్పాటై వస్తుంది. కాకపోతే ఫైల్స్ ట్రాష్‌లో పడేసిన తరువాత ఫైండర్ ఆప్షన్‌లోకి వెళ్లి సెక్యూర్ ఎమ్టీ ట్రాష్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. హార్డ్‌డ్రైవ్ మొత్తాన్ని ఓవర్‌రైట్ చేయాలనుకుంటే డిస్క్ యుటిలిటీ ఆప్‌లోకి వెళ్లి ఇరేజ్ అప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘సెక్యూరిటీ ఆప్షన్’ను సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే సరి. విండోస్, ఆపిల్ పీసీలు రెండింటిలోనూ ట్రాష్బిన్ను పూర్తిగా పక్కనబెట్టి ఫైళ్లను డిలీట్ చేయాలంటే ఫైల్ ష్రెడ్డర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఫైళ్లను ఓవర్‌రైట్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఒక ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది సాఫ్ట్‌వేరే నిర్ణయించుకుంటుంది.