ఫుట్ బాల్ కోసం ఇల్లు పీకి పందిరేశాడు! | Turkish football fan trashes house after his wife pranks him by repeatedly turning off the TV as he tries to watch EURO 2016 game | Sakshi
Sakshi News home page

ఫుట్ బాల్ కోసం ఇల్లు పీకి పందిరేశాడు!

Published Fri, Jun 17 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

ఫుట్ బాల్ కోసం ఇల్లు పీకి పందిరేశాడు!

ఫుట్ బాల్ కోసం ఇల్లు పీకి పందిరేశాడు!

యూరో కప్-2016 మ్యాచ్ ను ఆసక్తిగా తిలకిస్తున్న భర్తను భార్య టీవీ అస్తమానం ఆఫ్ చేస్తూ విసిగించింది. అంతే చిర్రెత్తుకొచ్చిన అతను ఏం చేశాడంటే..

టర్కీతో క్రోయేషియా ఆడుతున్న మ్యాచ్ ను తిలకిస్తున్న ఇజ్జెట్ సాల్టీని అతని భార్య ఒక్కసారిగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. సహనాన్ని కోల్పోయిన అతను ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని పెద్దగా అరిచాడు. దీంతో రేవేంజ్ తీసుకోవడానికి ఆమె టీవీని ఆఫ్ చేయడానికి నిర్ణయించుకుంది.

రూమ్ నుంచి బయటకు వెళ్లే ముందు కెమెరాను గదిలో అమర్చింది. గది నుంచి బయటకు వెళ్లి సరిగ్గా గోడకు అవతల ఉన్న స్థలంలో టీవీ ఆఫ్ చేసేందుకు తన ఫోన్ లోని రిమోట్ అప్లికేషన్ ను ఉపయోగించుకుంది.

ఆట మంచి రసవత్తరంగా సాగుతున్నప్పుడు, కరెక్ట్ గా ఇక గోల్ వేస్తున్నాడు అన్నప్పుడు, పోల్ నుంచి ప్లేయర్ గోల్ పోస్ట్ మీదకు బాల్ ను తన్నినపుడు టీవీని ఆఫ్ చేస్తూ .. ఆన్ చేస్తూ అతన్ని ఏడిపించింది. టీవీ అలా వస్తూ ఆగిపోతుండటంతో అర్ధంకాని అతను గదిలో ప్రతి ఇంచ్ ను వెతికాడు. ఏం అర్ధంకాకపోవడంతో తీవ్రంగా అసహననానకి లోనయ్యాడు. ఆ తర్వాత కూడా అంతే జరుగుతుండటంతో తట్టుకోలేక ముందున్న ల్యాప్ టాప్ ను తీసి టీవీ మీదకు విసిరేశాడు. అక్కడితో ఆగకుండా టీవీని కాలి తన్నాడు. దిండు, తినే చిప్స్ ను గాల్లోకి విసిరేశాడు. కింద పడిపోయన ల్యాప్ టాప్ ను తీసుకుని రెండుగా విడగొట్టి మళ్లీ మళ్లీ కిందేశాడుకాఫీ టేబుల్ ముందు ఉమ్మాడు. కాగా, ఈ మ్యాచ్ లో టర్కీ 1-0 తేడాతో ఓడిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement