
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుంచి దేశరాజధాని ఢిల్లీ వరకూ తమ సమస్యల పరిష్కారానికి రైతులు చేపట్టిన ‘కిసాన్ క్రాంతి యాత్ర’ బుధవారం ముగిసింది. ఈ యాత్రను యూపీ–ఢిల్లీ సరిహద్దులో పోలీసులు మంగళవారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు బారికేడ్లను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ముందుకు వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వాటర్ కేనన్లు, భాష్పవాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 12.30 గంటలకు రైతులను ఢిల్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో దాదాపు 70 వేల మంది రైతన్నలు తమ ట్రాక్టర్లతో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ స్మృతివనమైన ‘కిసాన్ ఘాట్’కు చేరుకున్నారు. అక్కడ చరణ్ సింగ్‌కు నివాళులు అర్పించిన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment