పో‘బడు’లెన్నో | tensions in teachers of transfers issues | Sakshi
Sakshi News home page

పో‘బడు’లెన్నో

Published Thu, Jun 18 2015 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

tensions in teachers of transfers issues

ఓ వైపు బదిలీల కౌన్సెలింగ్.. మరోవైపు రెషనలైజేషన్‌తో టీచర్లలో టెన్షన్
వెయ్యికి పైగా పోస్టులు సర్దుబాటే..!
జనరల్ టీచర్లకు మొండిచేరుు
‘పది’ ఫలితాలతో పారుుంట్లు ముడి

 
ఖమ్మం: గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్, పదోన్నతులు, రేషనలైజేషన్ ప్రక్రియకు ఎట్టకేలకు తెరలేచింది. ఈనెల 22 నుంచి వచ్చేనెల 16 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయూలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలతో ఎన్ని పాఠశాలలు విలీనం చేయూలి?
 
ఎంతమంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయూలి? ఏ పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. పదోన్నతుల ప్రక్రియను చేపట్టేదెలా..? మొదలైన అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. తాము పనిచేస్తున్న పాఠశాల పరిస్థితి ఏమిటి? పోస్టు ఉంటుందా? రేషలైజేషన్‌లో పోతుందా? ఎనిమిది సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు, ఐదు సంత్సరాలు నిండిన ప్రధానోపాధ్యాయులు ఎక్కడికి వెళ్లాలి? ఖాళీల వివరాలు ఏమిటనే విషయమై ఆరా తీస్తున్నారు.

సర్దుబాటు చేయూల్సిందే..
జిల్లాలో తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో వణుకు మొదలైంది. రేషలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఒక్క ఉపాధ్యాయున్నే ఉంచాలని ప్రకటించడంతో విద్యార్థులు లేని 17 పాఠశాలలు, 10 మంది విద్యార్థులు ఉన్న 91 పాఠశాలలు, 10 నుండి 20 మందిలోపే విద్యార్థులు ఉన్న 336 పాఠశాలలు మొత్తం 444 స్కూల్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.  గతంలో 20 మంది విద్యార్థుల కంటే  ఎక్కువ ఉన్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు.

కానీ ఇప్పుడు 30 మంది విద్యార్థుల వరకు ఒక్క ఉపాధ్యాయుడే ఉండేలా మార్గదర్శకాలు వెలువడ్డారుు. ఈ లెక్కన జిల్లాలో 850 పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి వస్తుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం 817 పోస్టులు ఏజెన్సీ ప్రాంతం, 477 పోస్టులు మైదాన ప్రాంతంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే పాఠశాల సక్రమంగా నడిచేది కాదని, ఇప్పుడు ఒక్కరే ఉంటే ఉపాధ్యాయుడు సెలవుపెట్టినా, వివిధ పనులు నిమిత్తం కార్యాలయాలకు వెళ్లినా, సకాలంలో పాఠశాలకు రాలేకపోయినా బడిమూత పడే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో 195 సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. 50 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న సక్సెస్ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తే 59 సక్సెస్ స్కూల్స్ విలీనం అయ్యే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం చదివిన విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లలేక తిరిగి తెలుగు మీడియంలో చేరే పరిస్థితి వస్తోంది.

జనరల్ టీచర్స్ ఎక్కడివారు అక్కడే..
నియమితులైనప్పటి నుంచి ఏజెన్సీలోనే పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులు తిరిగి అదే ప్రాంతంలో ఉండాల్సి వస్తోంది. నూతన మార్గదర్శకాల్లో ఏజెన్సీ టూ ఏజెన్సీ, ప్లేన్ టూ ప్లేన్ అనే నిబంధ పెట్టడంతో జనరల్ టీచర్స్‌కు మళ్లీ మొండిచేయే ఎదురైంది. 2000 సంవత్సరం డీఎస్సీ కంటే ముందు జిల్లా యూనిట్‌గా నియామకాలు జరిగాయి. ఆ తర్వాత జీవో నంబర్ 3 రావడంతో ఏజెన్సీలోని ఉపాధ్యాయ పోస్టులను అక్కడి నిరుద్యోగులతోనే భర్తీ చేయాలనే ఉత్తర్వులు వచ్చాయి. అయితే అక్కడ పనిచేస్తున్న సుమారు 2000 మందికి పైగా గిరిజనేతర ఉపాధ్యాయులు ఇటు ప్లేన్ ఏరియాకు రాలేకపోవడం, అక్కడ పదోన్నతులకు నోచుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని జనరల్ టీచర్స్ ఫోరంగా ఏర్పడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

పది ఫలితాలను బట్టి పాయింట్లు
పదో తరగతి ఫలితాలే ప్రామాణికంగా ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. అధిక ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు పాయింట్లు ఇచ్చారు. 25 శాతానికి లోబడి ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు పనిష్మెంట్ ఇచ్చే విధంగా మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement