Kadium Srihari
-
బాలురే టాప్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్–18లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్–10 ర్యాంకులన్నీ బాలురకే లభించగా.. అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో టాప్–10లో ఐదు ర్యాంకులు సాధించారు. ఈ రెండు కేటగిరీల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు టాప్–10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను సాధించారు. ఈనెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన ఎంసెట్–18 ఫలితాలు, ర్యాంకులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సచివాలయంలో విడుదల చేశారు. ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీతో కలిపి కంబైన్డ్ స్కోర్‌ను ఖరారు చేసి.. ర్యాంకులను కేటాయించారు. టాపర్లు వీరే.. ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లా కావూరిహిల్స్‌కు చెందిన అయ్యపు వెంకటఫణి వంశీనాథ్ 95.7245 కంబైన్డ్ స్కోర్‌తో మొదటి ర్యాంకు సాధించాడు. కావూరిహిల్స్కే చెందిన గట్టు మైత్రేయ 95.6955 కంబైన్డ్ స్కోర్‌తో రెండో ర్యాంకు పొందాడు. ఇక అగ్రికల్చర్/ఫార్మసీ కేటగిరీలో 93.3832 కంబైన్డ్ స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన పెరిగెల నమ్రత మొదటి ర్యాంకు.. 92.2744 కంబైన్డ్ స్కోర్‌తో హైదరాబాద్‌లోని లాలాగూడకు చెందిన వై.సంజీవకుమార్‌రెడ్డి రెండో ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్లో ఎక్కువ శాతం అర్హులు తెలంగాణ ఎంసెట్‌కు మొత్తంగా 2,21,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 1,36,305 మంది పరీక్షకు హాజరుకాగా.. 1,06,646 మంది (78.24 శాతం) అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో 66,858 మంది పరీక్ష రాయగా.. 60,651 మంది (90.72 శాతం) అర్హత సాధించారు. ఇంటర్లో ఫెయిలైన 18 వేల మందికి ర్యాంకుల్లేవు ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్లో ఫెయిలైన 18 వేల మందికిపైగా విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించలేదు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు 1,36,305 మంది హాజరుకాగా.. 1,06,646 మంది అర్హత సాధించారు. వీరిలో 14,453 మంది విద్యార్థులు ఇంటర్లో ఫెయిల్ కావడంతో.. ర్యాంకులను కేటాయించలేదు. ఇక అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో 66,858 మంది పరీక్ష రాయగా.. 60,651 మంది అర్హత సాధించారు. వీరిలో 4,480 మంది ఇంటర్లో ఫెయిల్ కావడంతో ర్యాంకులు కేటాయించలేదు. ఇక సీబీఎస్ఈ ఫలితాలు రాకపోవడంతో మరో 7,549 మంది విద్యార్థుల ర్యాంకులను ప్రకటించలేదు. ఇందులో ఇంజనీరింగ్ విభాగంవారు 4,171 మంది, అగ్రికల్చర్/ఫార్మసీవారు 3,378 మంది ఉన్నారు. ఒక్కరికీ రాని ఫుల్ మార్కులు 160 మార్కులకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో ఒక్క విద్యార్థికి కూడా పూర్తి మార్కుల లభించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ మార్కులు 152.8616 మాత్రమేకాగా.. రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి 150.8789 మార్కులు వచ్చాయి. ఇక అగ్రికల్చర్, ఫార్మసీలో 145.8842 మార్కులే టాప్. అవీ ఒక విద్యార్థికే వచ్చాయి. ఈసారి ఆన్లైన్లో పలు దఫాలుగా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో ప్రశ్నపత్రాల స్థాయి వేర్వేరుగా ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియ చేపట్టారు. దీంతో విద్యార్థులకు కచ్చితమైన (రౌండప్) మార్కులు రాలేదని అధికారులు వెల్లడించారు. ఇక సబ్జెక్టుల వారీగా చూసినా కూడా ఎవరికీ పూర్తి మార్కులురాకపోవడం గమనార్హం. గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా ఏ సబ్జెక్టులోనూ గరిష్ట మార్కులు రాలేదు. ఇంటర్ సబ్జెక్టుల్లో ‘ఫుల్’మార్కులు.. ఇంటర్మీడియట్ రెండేళ్లు కలిపి.. ఎంపీసీలోని మూడు ప్రధాన సబ్జెక్టుల్లో 581 మంది పూర్తిగా 600 మార్కులకు 600 మార్కులు సాధించారు. బైపీసీలోనూ 124 మంది విద్యార్థులు 600 మార్కులు పొందారు. జూలై 16 నుంచి తరగతులు: కడియం రాష్ట్రంలో ఇంజనీరింగ్ తరగతులను జూలై 16వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు షెడ్యూలు ఖరారు చేసినట్లు వెల్లడించారు. జూన్ 8వ తేదీ నాటికి మొదటిదశ అడ్మిషన్లు పూర్తి అవుతాయని, జూలై మొదటి వారంలో రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని వెల్లడించారు. సచివాలయంలో శనివారం ఎంసెట్ ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఈసారి షెడ్యూలును 15 రోజులు ముందుకు జరిపి, జూలై 16వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా విద్యారంగంలో చేపడుతున్న చర్యల వల్ల ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరిగిందన్నారు. బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ల్యాబ్ పరికరాలు, 75 శాతం తప్పనిసరి హాజరు ఉండాలన్న నిబంధనలతో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. ఈసారి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అధికారికంగా అనుమతినిస్తున్నామని, వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందన్నారు. విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డులను ఈ నెల 22 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి (http://eamcet. tsche.ac.in) డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ యాదయ్య పాల్గొన్నారు. -
మే నాటికి గురుకులాల్లో 8,434 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో వచ్చే మే నాటికి 8,434 పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలిలో శుక్రవారం గురు కుల పాఠశాలలపై లఘు చర్చ జరిగింది. 10 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం సమాధానమిస్తూ.. ఆయా పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏళ్లలో 296 గురుకులాలు ఏర్పాటైతే, రాష్ట్రం ఏర్పాటు తర్వాత 577 గురుకులాలు అదనంగా ఏర్పాటయ్యా యని తెలిపారు. ఇది ఒక చరిత్రగా అభివర్ణించారు. రాష్ట్రంలో 240 గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కోసం స్థలాలను సేకరించా మని చెప్పారు. 4 క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. అందులో రెండు బాలికలకు, మరో రెండు బాలురకు కేటాయించామన్నారు. స్కూల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుపై పరిశీలిస్తామని హామీనిచ్చారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష ఖర్చు.. పూర్వ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కడియం చెప్పారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. ఐదు సొసైటీల కింద ఉన్న గురుకులాలను విద్యాశాఖ పరిధిలోకి తేవాలన్న అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ప్రతీ విద్యార్థిపై తమ ప్రభుత్వం ఏడాదికి రూ.లక్ష ఖర్చు చేస్తోందన్నారు. గురుకులాల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. విదేశాల్లో అమలుచేస్తున్న విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో విదేశాలకు ఒక బృందాన్ని పంపుతామని కడియం తెలిపారు. సమయం కేటాయించడం వరకే చీఫ్ విప్ పని: సతీశ్ గురుకుల పాఠశాలలపై జరిగిన చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుల మధ్యే వాదోపవాదాలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన సభ్యుడు పురాణం సతీశ్ మాట్లాడుతూ.. కొమురం భీం జిల్లాలో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని ‘గురుకులాల్లో సైనిక్ స్కూల్’ అనాలని చెప్పడంతో సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభ్యులకు సమయం, అంశం కేటాయించడం వరకే చీఫ్‌విప్ పని. సభ్యుల హక్కులకు పాతూరి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. అంతా ఆయనే మాట్లాడుతారు. జోక్యం చేసుకుంటారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరో సభ్యుడు రాములు నాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ‘దాన వీర శూర కర్ణ’లాంటి వారని, అందుకే బడుగువర్గాలకు గురుకులాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. -
జనవరిలో డీఎస్సీ!
-
జనవరిలో డీఎస్సీ!
♦ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కారు నిర్ణయం ♦ 10 వేల వరకు పోస్టులు ఉండే అవకాశం! ♦ వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త టీచర్లు ♦ అప్పటివరకు విద్యా వలంటీర్లతో బోధన ♦ వచ్చేనెల 10 నాటికి 7,983 మంది వీవీల నియామకం ♦ రూ. 8 వేల వేతనంతో మండలం యూనిట్‌గా భర్తీ ♦ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రక్రియను పూర్తిచేసి పాఠశాలల్లో కొత్త టీచర్లను నియమించనుంది. దాదాపు 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా.. ప్రక్రియ పూర్తయ్యేందుకు ఐదారు నెలల సమయం పడుతుంది. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం దాదాపు పూర్తయి, వేసవి సెలవుల సమయం వస్తుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీచేస్తే మే నెలాఖరుకల్లా నియామకాల ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వచ్చే ఏడాది జూన్ 12న స్కూళ్లు ప్రారంభించే నాటికి కొత్త టీచర్లను పాఠశాలలకు పంపించాలన్న యోచనలో ఉంది. వారంలో విద్యా వలంటీర్లు.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నందున టీచర్లు లేని స్కూళ్లలో వెంటనే విద్యా వలంటీర్లను నియమించనున్నారు. ప్రస్తుతమున్న 7,983 ఖాళీల్లో సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఈ నియామకాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యా వలంటీర్లకు నెలకు రూ.8 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించే అవకాశముంది. ఎస్జీటీ ఖాళీల్లో నియమించే వారికి ఇంటర్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్హత ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ స్థానంలో నియమితులయ్యే వారికి డిగ్రీతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అర్హత ఉండాలి. మండలం యూనిట్‌గా జిల్లా యంత్రాంగం నేతృత్వంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. ఆ మండలానికి చెందిన వారినే విద్యా వలంటీర్లుగా నియమిస్తారు. వయోపరిమితి తదితర వివరాలు మార్గదర్శకాల్లో ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టెన్త్, ఇంటర్, డీఎడ్/బీఎడ్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి మెరిట్‌ను రూపొందించి నియామకాలు చేపడతారు. దీంతోపాటు రోస్టర్, రిజర్వేషన్లను పాటిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలు రెండు మూడు రోజుల్లో జారీ కానున్నాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. ఖాళీలపై స్పష్టత వచ్చినందునే.. ‘‘ఉపాధ్యాయ ఖాళీలపై ప్రస్తుతం స్పష్టత వచ్చింది. గతంలో ఆ స్పష్టత లేనందునే కొత్త నోటిఫికేషన్‌పై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కూడా వెంటనే నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. నోటిఫికేషన్ ఇచ్చినా ఐదారు నెలల సమయం పడుతుంది. మొత్తానికి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లను నియమిస్తాం. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఎప్పుడన్నది త్వరలో నిర్ణయిస్తాం..’’ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. జిల్లాల వారీగా నియామకం కానున్న విద్యా వలంటీర్లు - మహబూబ్‌నగర్ 1,646 - రంగారెడ్డి 1,408 - ఆదిలాబాద్ 1,244 - మెదక్ 1,104 - ఖమ్మం 674 - నిజమాబాద్ 480 - హైదరాబాద్ 414 - నల్లగొండ 362 - కరీంనగర్ 337 - వరంగల్ 314. -
వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ
నల్లబెల్లి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టనున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని గురుకుల పాఠశాలలను కేజీ నుంచి పీజీకి సరిపోయేలా వసతులు కల్పిస్తూ తీర్చిదిద్దేందుకు అందుకు అవసరమైన మార్గాదర్శకాలు సీఎం కేసీఆర్‌కు అందించినట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి నియోజక వర్గంలో 10 గురుకులాలు ఏర్పాటు చేస్తామని కడియం శ్రీహరి ఈ సందర్భంగా ప్రకటించారు. -
'అనుమతుల్లేని ఇంటర్ విద్యాసంస్థలపై చర్యలు'
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని ఇంటర్ విద్యా సంస్థల్లో ఒక కళాశాలకు అనుమతి తీసుకొని మూడు, నాలుగు కళాశాలలు నడుపుతున్నారని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి సంఘం అధ్యక్షుడు కొండా సాయికిరణ్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన బంజాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ.. 'కళాశాలల్లో సరైన వసతులు కరువయ్యాయి. దీంతో విద్యార్థులు సతమతమౌతున్నారు. తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలి' అని మంత్రిని కోరారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న కళాశాలల జాబితా తమకు అందజేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చారు. -
'కడియం శ్రీహరిది అసత్యప్రచారం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి రికార్డులను తాము అడగడం లేదని తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేయడం సరికాదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. తాము పలుమార్లు రికార్డులు ఇవ్వాలని అడిగినా స్పందించకుండా లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి, తాను చర్చించామని, ఆతరువాత గవర్నర్ సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులతో కూడి తామిద్దరం చర్చించామని తెలిపారు. ఆ సమావేశంలో రికార్డులన్నింటినీ అప్పగిస్తామని కడియం శ్రీహరే స్వయంగా అంగీకరించి తరువాత మాటతప్పారన్నారు. తాము పలుమార్లు లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తమ రికార్డులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా మీడియా బాధ్యత తీసుకుంటే తెలంగాణ మంత్రి కడియం శ్రీహరితో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చర్చలకు మంత్రి కడియం రావాలని పేర్కొన్నారు. తాము అనేక ప్రయత్నాలు చేసినా రికార్డులు ఇవ్వకుండా తిరిగి అసత్యప్రచారాలు చేయడం కడియం శ్రీహరికి తగదని హితవు పలికారు. అయిదుసార్లు లేఖలు రాశాం వేణుగోపాలరెడ్డి తమ రికార్డులు అప్పగించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలికి, తెలంగాణ ప్రభుత్వానికి తాము అయిదుసార్లు లేఖలు రాసినా అక్కడినుంచి స్పందన లేకుండా పోయిందని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ నరసింహరావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలుమార్లు సంప్రదింపులు చేసిన వివరాలను అందించారు. అనేకమార్లు లేఖలురాసినా స్పందించకుండా తాము సంప్రదించలేదనడం దారుణమన్నారు. రికార్డులకోసం కమిటీవేసి విభజన చేద్దామని తమనుంచి పేర్లు ప్రతిపాదించినా వారు రికార్డులు ఇవ్వకుండా జాప్యంచేస్తున్నారని పేర్కొన్నారు. రికార్డులకోసం సమయం, తేదీ తెలియచేయాలని తాము కోరినా వారినుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. -
పో‘బడు’లెన్నో
ఓ వైపు బదిలీల కౌన్సెలింగ్.. మరోవైపు రెషనలైజేషన్తో టీచర్లలో టెన్షన్ వెయ్యికి పైగా పోస్టులు సర్దుబాటే..! జనరల్ టీచర్లకు మొండిచేరుు ‘పది’ ఫలితాలతో పారుుంట్లు ముడి ఖమ్మం: గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్, పదోన్నతులు, రేషనలైజేషన్ ప్రక్రియకు ఎట్టకేలకు తెరలేచింది. ఈనెల 22 నుంచి వచ్చేనెల 16 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయూలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలతో ఎన్ని పాఠశాలలు విలీనం చేయూలి? ఎంతమంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయూలి? ఏ పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. పదోన్నతుల ప్రక్రియను చేపట్టేదెలా..? మొదలైన అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. తాము పనిచేస్తున్న పాఠశాల పరిస్థితి ఏమిటి? పోస్టు ఉంటుందా? రేషలైజేషన్‌లో పోతుందా? ఎనిమిది సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు, ఐదు సంత్సరాలు నిండిన ప్రధానోపాధ్యాయులు ఎక్కడికి వెళ్లాలి? ఖాళీల వివరాలు ఏమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. సర్దుబాటు చేయూల్సిందే.. జిల్లాలో తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో వణుకు మొదలైంది. రేషలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఒక్క ఉపాధ్యాయున్నే ఉంచాలని ప్రకటించడంతో విద్యార్థులు లేని 17 పాఠశాలలు, 10 మంది విద్యార్థులు ఉన్న 91 పాఠశాలలు, 10 నుండి 20 మందిలోపే విద్యార్థులు ఉన్న 336 పాఠశాలలు మొత్తం 444 స్కూల్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గతంలో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. కానీ ఇప్పుడు 30 మంది విద్యార్థుల వరకు ఒక్క ఉపాధ్యాయుడే ఉండేలా మార్గదర్శకాలు వెలువడ్డారుు. ఈ లెక్కన జిల్లాలో 850 పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి వస్తుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం 817 పోస్టులు ఏజెన్సీ ప్రాంతం, 477 పోస్టులు మైదాన ప్రాంతంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే పాఠశాల సక్రమంగా నడిచేది కాదని, ఇప్పుడు ఒక్కరే ఉంటే ఉపాధ్యాయుడు సెలవుపెట్టినా, వివిధ పనులు నిమిత్తం కార్యాలయాలకు వెళ్లినా, సకాలంలో పాఠశాలకు రాలేకపోయినా బడిమూత పడే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో 195 సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. 50 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న సక్సెస్ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తే 59 సక్సెస్ స్కూల్స్ విలీనం అయ్యే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం చదివిన విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లలేక తిరిగి తెలుగు మీడియంలో చేరే పరిస్థితి వస్తోంది. జనరల్ టీచర్స్ ఎక్కడివారు అక్కడే.. నియమితులైనప్పటి నుంచి ఏజెన్సీలోనే పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులు తిరిగి అదే ప్రాంతంలో ఉండాల్సి వస్తోంది. నూతన మార్గదర్శకాల్లో ఏజెన్సీ టూ ఏజెన్సీ, ప్లేన్ టూ ప్లేన్ అనే నిబంధ పెట్టడంతో జనరల్ టీచర్స్‌కు మళ్లీ మొండిచేయే ఎదురైంది. 2000 సంవత్సరం డీఎస్సీ కంటే ముందు జిల్లా యూనిట్‌గా నియామకాలు జరిగాయి. ఆ తర్వాత జీవో నంబర్ 3 రావడంతో ఏజెన్సీలోని ఉపాధ్యాయ పోస్టులను అక్కడి నిరుద్యోగులతోనే భర్తీ చేయాలనే ఉత్తర్వులు వచ్చాయి. అయితే అక్కడ పనిచేస్తున్న సుమారు 2000 మందికి పైగా గిరిజనేతర ఉపాధ్యాయులు ఇటు ప్లేన్ ఏరియాకు రాలేకపోవడం, అక్కడ పదోన్నతులకు నోచుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని జనరల్ టీచర్స్ ఫోరంగా ఏర్పడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. పది ఫలితాలను బట్టి పాయింట్లు పదో తరగతి ఫలితాలే ప్రామాణికంగా ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. అధిక ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు పాయింట్లు ఇచ్చారు. 25 శాతానికి లోబడి ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు పనిష్మెంట్ ఇచ్చే విధంగా మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. -
140 కోట్లతో జూనియర్ కాలేజీల అభివృద్ధి
డీఎస్సీపై తగు సమయంలో నిర్ణయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి పక్కా చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రూ. 140.75 కోట్లతో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 402 కాలేజీలుంటే అందులో 332 కాలేజీలకు సొంత భవనాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 70 కాలేజీలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరో 15 కాలేజీలకు స్థలాలు లేవని, దీంతో అవి స్కూళ ్ల ఆవరణలో కొనసాగుతున్నాయన్నారు. వాటికి స్థలాలను సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ముందుగా ఆర్ఐడీఎఫ్-20 కింద రూ. 58.50 కోట్లతో 26 కాలేజీలకు (ఒక్కో దానికి రూ. 2.25 కోట్లు) సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. మిగతా కాలేజీలకు ఆర్ఐడీఎఫ్-21లో సొంత భవన నిర్మాణాలను ప్రతిపాదించామన్నారు. అవీ త్వరలోనే వస్తాయని, మొత్తంగా ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్ఐడీఎఫ్-20లోనే 69 కాలేజీలకు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నామన్నారు. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా 177 జూనియర్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కొత్త కాలేజీల మంజూరుపై మరో 15 రోజుల్లో పరిశీలించి అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు కాకుం డా మరో 600 ఖాళీలు ఉన్నాయన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత వచ్చాక మిగతా వాటిపై నిర్ణయం ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లలో ఇవీ ఉండే అవకాశం ఉందన్నారు. వర్సిటీల చట్టం రూపకల్పన తరువాత వీసీలను నియమిస్తామని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, కొత్త డీఎస్సీ ప్రకటనపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. 85.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ లో 85.98, ఇంజినీరింగ్ లో 70.65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇవ్వగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు. విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా విడుదల చేశారు. -
నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు
-
నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు
* విడుదల చేయనున్న కడియం శ్రీహరి * ఇంటర్ వార్షిక పరీక్షల మార్కుల వెయిటేజీతో ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను గురువారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొ. ఎన్వీ రమణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ర్యాంకులను హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని వెల్లడించారు. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇస్తుండగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు. ఫలితాల కోసం www.sakshieducation.com www.tseamcet.in www.results.cgg.gov.in -
రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
-
రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ - 2015 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జేఎన్టీయూలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈమేరకు మంత్రి బుధవారం విలేకరులకు సమాచారం అందించారు. ఎంసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు www.sakshieducation.com, www.teamct.in వెబ్ సైట్ లో చూడవచ్చని ఆయన తెలిపారు. -
ఎర్రబెల్లి వర్సెస్ కడియం
కొనసాగుతున్న మాటలయుద్ధం టీఆర్ఎస్, టీడీపీ శ్రేణుల ఘర్షణ పాలకుర్తి/దేవరుప్పుల: డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య మాటలయుద్ధం కొనసాగుతోం ది. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మె రలో జరిగిన కార్యక్రమంలో ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. గ్రామంలో రూ. 4 కోట్ల తో నిర్మించనున్న రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం కడియం, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి మాట్లాడు తూ.. ‘అభివృద్ధి పనులకు నిధుల మంజూరు లో వివక్ష చూపొద్దని చేతులెత్తి మొక్కుతు న్నా.. నాపై కక్షను ప్రజలపై తీర్చుకోవద్దు.’ అని అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణాల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రూ. 30 కోట్ల వరకు మంజూరు చేసిన ప్రభుత్వం... పాలకుర్తికి రూ. 4.50 కోట్లు మాత్రమే ఇచ్చి వివక్ష చూపిందన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనను కలిసి పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూ రులో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. మధ్య లో నిధుల మంజూరును అడ్డుకున్న దొంగలెవరో తేల్చాలన్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి మాట్లాడుతూ నిధుల మంజూరులో వివక్ష లేదన్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి జోక్యం చేసుకుని నియోజకవర్గానికి సీఆర్ఆర్ గ్రాంటు లో రూ. 4.50 కోట్లు మాత్ర మే వచ్చాయని, మిగిలిన నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇంతలో టీఆర్ఎస్ నాయకుడు ముత్తినేని సోమేశ్వర్రావు దయాకర్‌రావును అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు వేదిక వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ కూర సురేందర్, సీఐ తిరుపతి, ఎస్సై ఉస్మాన్ షరీఫ్ పోలీసు బలగాలతో వారిని అడ్డుకున్నారు. సుమారు 20 నిమిషాలు సమ యం ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. కడియం విజ్ఞప్తి మేరకు ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. అరుుతే కడియం వెళ్తుండగా నియోజకవర్గానికి నిధులు అడ్డుకుంది ఆయనేనని దయాకర్‌రావు అన్నారు. -
కడియం పై ఎర్రబెల్లి ఫైర్
-
కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం
వరంగల్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ల మధ్య వాగ్వివాదం జరిగింది. పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఎర్రబల్లి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విపక్ష ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు నిధులు కేటాయించే విషయంలో అధికార పార్టీ వివక్ష చూపుతోందని ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఆరోపించారు. దీంతో అక్కడి ఉన్న కడియం, దయాకర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పాలకుర్తి నియోజక వర్గానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వానికి కడియం శ్రీహరి మోకాలడ్డుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని కడియం శ్రీహరి తెలిపారు. (పాలకుర్తి) -
'మనసున్న మారాజు కేసీఆర్'
సూర్యాపేట(నల్లగొండ): మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. వసతి గృహాలలో విద్యార్థులు దొడ్డు బియ్యం తినలేక పోవడాన్ని గుర్తించిన కేసీఆర్.. సన్నబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిచడమే ధ్యేయంగా కేజీ టు పీజీ విద్య అమలులోకి తేచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, అందులో 30 లక్షల మంది ప్రభుత్వం, మరో 30 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. 60 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడం సాధ్యం కాదన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యస్తున్న 30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే కతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సదస్సులో ట్రస్మా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఆయన వెంట మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ట్రస్మా ప్రతినిధులు ఉన్నారు. -
పూలేకు డిప్యూటీ సీఎం కడియం నివాళి
వరంగల్: జ్యోతిరావు పూలే 189వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ఉదయం వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు జంక్షన్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, జిల్లా కలెక్టర్ వాకాటి కర్ణ పాల్గొన్నారు.