
కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం
వరంగల్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ల మధ్య వాగ్వివాదం జరిగింది. పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఎర్రబల్లి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విపక్ష ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు నిధులు కేటాయించే విషయంలో అధికార పార్టీ వివక్ష చూపుతోందని ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఆరోపించారు.
దీంతో అక్కడి ఉన్న కడియం, దయాకర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పాలకుర్తి నియోజక వర్గానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వానికి కడియం శ్రీహరి మోకాలడ్డుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని కడియం శ్రీహరి తెలిపారు.
(పాలకుర్తి)