ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 150–200 మంది ఉన్న అల్లరి మూక కంగ్లా ఫోర్ట్ సమీపంలో మహాబలి రోడ్డుపై పార్క్ చేసి ఉన్న వాహనాలకు శనివారం నిప్పు పెట్టారు. పోలీసుల ఆయుధాలను తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. అల్లరిమూకను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.
ఆ తర్వాత ఆర్మీ రంగంలోకి దిగి అల్లరి మూకల్ని చెదరగొట్టింది. పలు జిల్లాల్లో అల్లరిమూకలకి, భద్రతా బలగాలకి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజుల్లో బిష్ణాపూర్ జిల్లాలో జరిగిన జాతుల మధ్య ఘర్షణల్లో ఒక టీనేజర్, ఒక పోలీసు కమెండో సహా నలుగురు మృతి చెందారు. మెయిటీ వర్గం తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించిన దగ్గర్నుంచి మణిపూర్‌లో హింస భగ్గుమంటోంది.
Comments
Please login to add a commentAdd a comment