గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.
‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.
మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్‌ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment