నాలుగు కాళ్ల కోడిపిల్ల  | four legged chick in YSR Distt | Sakshi
Sakshi News home page

నాలుగు కాళ్ల కోడిపిల్ల 

Published Mon, Mar 18 2024 6:29 AM | Last Updated on Mon, Mar 18 2024 6:29 AM

four legged chick in YSR Distt - Sakshi

ఏపీలోని వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురంలో నాలుగు కాళ్లతో జన్మించిన ఓ కోడి పిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామానికి చెందిన దామోదర్‌.. తన ఇంట్లో మూడు రోజుల కిందట ఓ కోడి పెట్టిన గుడ్లను పొదిగేశారు.

అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. ఆరోగ్యంగా ఉన్న ఈ కోడి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు.     – పులివెందుల రూరల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement