kodi
-
నాలుగు కాళ్ల కోడిపిల్ల
ఏపీలోని వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురంలో నాలుగు కాళ్లతో జన్మించిన ఓ కోడి పిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామానికి చెందిన దామోదర్.. తన ఇంట్లో మూడు రోజుల కిందట ఓ కోడి పెట్టిన గుడ్లను పొదిగేశారు. అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. ఆరోగ్యంగా ఉన్న ఈ కోడి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. – పులివెందుల రూరల్ -
కోడి కూస్తోందని కేసు పెట్టారు
ఊళ్లల్లో ఇరుగుపొరుగు మధ్య కోళ్ల పంచాయితీ కొత్తేం కాదు. కానీ ‘పక్కింటివాళ్ల కోడి వేధిస్తోంది, భరించలేకుండా ఉన్నాం బాబోయ్’ అంటూ కోర్టుకెక్కారు జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా. కోడిపుంజు తెగ కూస్తూ తమను ఇబ్బందిపెడుతోందని కోర్టుకు విన్నవించుకున్నారు. కోడన్నాక కూయకుండా ఉంటుందా? ఆ మాత్రానికే కేసు పెట్టాలా అతిగాకపోతేను. అంటే.. అది కూస్తుంది పది ఇరవైసార్లు కాదు.. రోజుకు 200 సార్లట. అదికూడా 80 డెసిబెల్స్ రేంజులో. అంటే రద్దీగా ఉన్న ఓ వీధిలో వచ్చే శబ్దం అంత అన్నమాట. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ కూతల మోత... సాయంత్రం ఇతర కోళ్లతోపాటు గూట్లోకి చేరేంతవరకూ ఉంటోంది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ గోలను భరించలేక వారు కోడిపై కేసు పెట్టారు. ‘వాళ్లు కోడిని వదులుకోలేరు. అది ఉంటే మేం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం. తలుపులు, కిటికీలు తీస్తే నాన్‌స్టాప్ చప్పుడు. చివరకు గార్డెన్‌కూ వెళ్లలేకపోతున్నాం. అదో, మేమో తేల్చుకోవాల్సిందే’ అని అంటున్నారు. పొద్దున లేస్తే కోడిచేసే చప్పుడును రికార్డు చేసి కోర్టు ముందుంచారు. అంతేకాదు.. దాని దెబ్బకు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్ల గురించి కూడా కేసులో ప్రస్తావించారు. కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది. ఆయన తీర్పుమీదే ఈ కోడి భవిష్యత్ ఆధారపడి ఉందన్నమాట. -
స్పృహతప్పి పడిపోయిన అనుపమ..
టీ.నగర్: ఒక చిత్రంలో నటిస్తూ వచ్చిన అనుపమ హఠాత్తుగా స్పృహ తప్పడం సంచలనం కలిగించింది. ధనుష్‌కు జంటగా ‘కొడి’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటించారు. ప్రస్తుతం మళయాల, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గురువారం ఆమె ఒక తెలుగు చిత్రంలో ప్రకాష్‌రాజ్‌తో నటిస్తూ వచ్చారు. ఒక టెన్షన్ సీన్లో నటిస్తుండడంతో భావోద్వేగానికి గురైన అనుపమ స్పృహతప్పి కిందపడ్డారు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. దీనిగురించి అనుపమ తన ఫేస్బుక్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ప్రకాష్‌రాజ్‌తో నటిస్తుండగా డైలాగ్‌ను పూర్తిగా చెప్పలేక తటపాయించానని, వెంటనే ఆయన మళ్లీ డైలాగ్ చదివి నటించాలని తెలిపారన్నారు. ఇదివరకే తనకు చలిజ్వరంతో బాధపడ్డానని, లో బీపీతో బాధపడినట్లు తెలిపారు. దీంతో స్పృహతప్పడం జరిగిందని, ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. -
త్రిష గర్జన మొదలైంది
నటి త్రిష గర్జన మొదలైంది. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కథానాయికల మార్కెట్ తగ్గుతుంటుంది. అయితే ఇందుకు చెన్నై చిన్నది త్రిషను అతీతమనే చెప్పాలి. ఈ బ్యూటీ సినిమా వయసు ఒకటిన్నర దశాబ్దం. తమిళం, తెలుగు, కన్నడం, చివరికి బాలీవుడ్ చిత్ర నటనానుభాన్ని కూడా చవి చూసేశారు. అలాంటి త్రిషకు ఒక సమయంలో మార్కెట్ పడిపోయింది. ఇక అమ్మడి పనైపోయిందనే ప్రచారం జోరందుకుంది. త్రిష కూడా సంసార జీవితంలో సెటిలైపోదామని వివాహానికి సిద్ధమైపోయారు. సినీ నిర్మాత, వ్యాపారవేత్త ప్రేమ, పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే అక్కడే త్రిష జీవితం అనుకోని మలుపు తిరిగింది. త్రిష పెళ్లి పీట ల వరకూ వెళ్లలేదు. అది ఎలాంటి అనుభవాన్ని కలిగించిందోగానీ, ఇకపై నటనపైనే తన దృష్టి అంతా అని త్రిష నిర్ణయం తీసుకున్నారు. అంతే తన మార్కెట్ అంతకుమించి అన్నట్లు పెరిగిపోయింది. అప్పటి వరకూ కమర్షియల్ చిత్రాల్లో హీరోలతో డ్యూయెట్లు పాడుతూ అందాలారబోతకు పరిమితమైన త్రిషకు స్త్రీ ప్రధాన ఇతివృత్త కథా చిత్రాల అవకాశాలు రావడం విశేషం. అలా ఈ భామ నటించిన నాయకి నిరాశపరచినా తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. అందులో సగం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే కావడం మరో విశేషం. నటుడు ధనుష్ సరసన కొడి చిత్రంలో రాజకీయ నాయకురాలిగా త్రిష అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మోహిని అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంతో పాటు అరవిందస్వామి సరసన చతురంగ వేట్టై–2, విజయ్‌సేతుపతికి జంటగా 96, ఒక మలయాళ చిత్రం, 1818 అనే మరో చిత్రంలో నటించడానిక కమిట్ అయ్యారు. తాజాగా మరో చిత్రం త్రిష ఖాతాలో చేరింది. అదే గర్జన. హిందీలో అనుష్క శర్మ నాయకిగా నటించిన ఎన్ హెచ్–10 చిత్రానికి రీమేక్ ఈ గర్జన. రోడ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో త్రిష సరసన బుల్లితెర నటుడు అమిత్ భార్గవ్ నటిస్తున్నారు. వంశీకృష్ణ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. -
ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసిందా?
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి... ప్లీజ్ - హీరోయిన్ ఛాన్స్ కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే అమ్మాయిల నోట తరచూ వినిపించే మాట ఇది. అదృష్ట దేవత తలుపు తట్టిందా బంగారం లాంటి అవకాశం రానే వచ్చేస్తుంది. కొంతమంది అమ్మాయిలకు అట్టే ట్రై చేయకుండానే ఛాన్స్ వచ్చేస్తుంది. అందుకు ఓ ఉదాహరణ - త్రిష. ఒక్క ఛాన్స్ ఈజీగా దక్కించేసుకుని హీరోయిన్ అయిన తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చేసుకున్నారామె. ఇటు తెలుగులో, అటు తమిళంలో దాదాపు సీనియర్స్ నుంచి యంగ్‌స్టర్స్ దాకా స్టార్స్ అందరి సరసనా ఈ చెన్నై బ్యూటీ నటించారు. ఒక్క సూపర్ స్టార్ రజనీకాంతే బాకీ. ఆయన సరసన నటించాలని త్రిషకు మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది. ‘‘రజనీ సార్‌తో కలసి నటించాలనే నా కోరిక ఎప్పుడు తీరుతుందో? సూపర్‌స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ ఎప్పుడొస్తుందో?’’ అని ఛాన్స్ దొరికిన ప్రతిసారీ మీడియా సాక్షిగా మనసులో కోరిక బయటపెట్టారామె. ఆ కోరిక త్వరలో నిజం కానుందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీ అల్లుడు ధనుష్ ఓ సినిమా నిర్మించనున్నారు. అందులో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేశారట! మొదట్లో రజనీకి జోడీగా అమలా పాల్‌ను అనుకున్నారు. కానీ, చివరికి ఆ ఛాన్స్ చెన్నై సుందరి త్రిషకే వచ్చిందట. ఇటీవల తెలుగులో ‘ధర్మయోగి’గా విడుదలైన తమిళ సినిమా ‘కొడి’లో ధనుష్, త్రిష జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్లో రజనీకాంత్ సినిమా విషయమై ధనుష్‌ను త్రిష రిక్వెస్ట్ చేయడం, ఆయన ఓకే చేయడం జరిగాయేమోనని కోలీవుడ్ జనాలు అంటున్నారు. -
సూపర్‌స్టార్‌తో రొమాన్స్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేయాలన్న చెన్నై చిన్నది త్రిష కోరిక నెరవేరనుందా? అది నెరవేరుతుందో? లేదో గానీ, అలాంటి ప్రయత్నాలు మాత్రం త్రిష ముమ్మరంగా చేస్తున్నట్లు కోడంబాక్కం వర్గాల తాజా సమాచారం. రజనీకాంత్‌తో మినహా త్రిష ఇతర ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారని చెప్పవచ్చు. సూపర్‌స్టార్‌తో నటించాలన్నది ఆ అమ్మడి చిరకాల కోరిక. తన సహ నటీమణులైన నయనతార, శ్రీయ, అనుష్క, చివరికి రాధికాఆప్తే, ఆంగ్ల భామ ఎమీజాక్సన్ కూడా రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని అందుకున్నారు. తనకెందుకు అలాంటి అవకాశం రాలేదన్న ప్రశ్నను త్రిష చాలా సార్లు వేసుకున్నారట. కబాలి చిత్రంలో రజినీకాంత్‌తో జత కట్టే అవకాశం తనకు లభిస్తుందని ఈ బ్యూటీ ఆశించిదట. అరుుతే ఆ అవకాశం నటి రాధికాఆప్తేను వరించింది. ఎప్పటికై నా సూపర్‌స్టార్‌తో నటించి తీరతానన్న నమ్మకంతో ఉన్న త్రిష తాజాగా తన కోరికను నెరవేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో నటించిన త్రిష తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా కబాలి చిత్ర కాంబినేషన్ రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సంచలన చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నారు. దీంతో ఈ చిత్రంలో రజినీకాంత్‌తో రొమాన్స చేసే అవకాశం కోసం త్రిష ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో కథానాయకిగా అవకాశం లేకపోతే అతిథి పాత్రలోనైనా నటించడానికి రెడీ అంటున్నారట. త్రిష ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. కాగా ప్రస్తుతం హీరోరుున్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినీని పూర్తి చేసే పనిలో ఉన్న త్రిష తాజాగా అరవిందస్వామికి జంటగా చతురంగవేటై్ట-2, విజయ్‌సేతపతి సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు. -
ముఖ్యమంత్రి కావాలని ఉంది
నాకు ముఖ్యమంత్రి కావాలని ఆశగా ఉందనే అభిప్రాయాన్ని నటి త్రిష వ్యక్తం చేశారు. కలలు కనాలి. వాటిని నెరవేర్చుకోవడానికి నిరంతరం కృషి చేయాలన్న మన విజ్ఞాన గని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హితవును నటి త్రిషకు అమలు పరస్తున్నట్లుంది కదూ! అయితే నిరంతర శ్రమతోనే ఈ చెన్నై చిన్నది నటిగా ఈ స్థాయికి చేరుకున్నారన్నది మరచిపోరాదు.సాధారణంగా హీరోయన్ల పరిమితి చాలా తక్కువగానే ఉంటుంది. మహా అరుుతే ఐదేళ్లు రాణించగలరు. అలాంటిది 15 ఏళ్లుగా ఏకధాటిగా నాయకి స్థానంలోనే ప్రకాశిస్తున్న అతి తక్కువ మంది నటీమణుల్లో త్రిష ఒక్కరు. ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా నటిగా మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ధనుష్‌కు జంటగా నటించిన కొడి చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే ఇందులో తను రాజకీయనాయకురాలిగా నటించారు. ఇలాంటి తరుణంలో తనకు ముఖ్యమంత్రి కావాలని ఆశగా ఉందని ఒక భేటీలో ఈ భామ పేర్కొనడం గమనార్హం.అయితే త్రిషకు నిజంగానే రాజకీయరంగంపై మోహం పెరిగిందా? లేక మరేదైనా ఉద్దేశంతో అలా అన్నారా? ఎందుకంటే సినీ కథానాయకులు, నాయకిల తదుపరి గురి రాజకీయరంగంగా మారుతుండడం చూస్తున్నాం. అయితే త్రిష కోరిక మాత్రం వేరే. కొడి చిత్రంలో రాజకీయనాయకురాలి పాత్రలో నటించిన త్రిష తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఆశగా ఉందని పేర్కొన్నారు. అంతే కాదు అలాంటి అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. మరో విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో చదువుకున్న చర్చ్‌పార్క్ పాఠశాలలోనే నటి త్రిష విద్యాభ్యాసం చేశారన్నది గమనార్హం. అదే విధంగా ఈ మధ్య ముఖ్యమంత్రి చేతుల మీదగా అవార్డును కూడా అందుకుందీ ఈ బ్యూటీ. -
కష్టకాలంలో ఆదుకున్నారు
బాధ, కష్టకాలాల్లో అండగా నిలిచిన మంచి మిత్రుడు దర్శకుడు వెట్రిమారన్ అని నటుడు ధనుష్ పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం కొడి. ఇందులో తొలిసారిగా అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. త్రిష, అనుపమ పరమేశ్వరన్ నాయికలుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ రాజకీయవాదిగా ప్రధాన పాత్రను పోషించడం మరో విశేషం. కాళీవెంకట్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్‌రూట్ ఫిలిం కంపెనీ పతాకంపై నిర్మించారు. ఈయన శిష్యుడు, ఇంతకు ముందు ఎదిర్ నీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆర్ఎస్.దురెసైంథిల్‌కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం కొడి. పూర్తి రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న కొడి చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత,దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ దివంగత దర్శకుడు బాలుమహేంద్ర నుంచి తనకు మంచి విషయాలు చాలా జరిగాయన్నారు.అదే విధంగా నటుడు ధనుష్ నుంచి కూడా అని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యల్లో ఉన్నాను ఒక చిత్రం చేసి పెట్టమని ధనుష్‌ను కోరానన్నారు. వెంటనే ఆయన దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ చెప్పిన కథ లైన్ బాగుంది వినమన్నారు. దురెసైంథిల్‌కుమార్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని అలా తాను నిర్మాతను అయ్యాయని తెలిపారు. దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎలాంటి కథ తయారు చేసినా ముందుగా గుర్తు కొచ్చేది నటుడు ధనుష్నేనని అన్నారు. తనను దర్శకుడిని చేసింది ఆయనేనని తెలిపారు. ధనుష్ చిత్ర నిర్మాణ సంస్థలో ఎదిర్‌నీశ్చల్, కాక్కీసట్టై చిత్రాలకు దర్శకత్వం వహించానని, ఇప్పడు ఆయన హీరోగా కొడి చిత్రం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కుటుంబసభ్యులతో చేసిన చిత్రం నటుడు ధనుష్ మాట్లాడుతూ తన సుఖ సంతోషం సమయాల్లో చాలా మంది పాలు పంచుకున్నారని, అయితే కష్ట సుఖాల్లో అండగా ఉన్న ఏకైక మిత్రుడు దర్శకుడు వెట్రిమారన్ మాత్రమేనని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి నిర్మాణంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేదికపై ఉన్న వాళ్లందరు తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉన్న వాళ్లేనన్నారు. అప్పటి నుంచి కలిసి పని చేస్తున్నామని చెప్పారు. అలా ఒక కుటుంబ సభ్యులతో కలిసి చేసిన చిత్రం కొడి అని పేర్కొన్నారు. తాను ఇంతకు ముందు నటించిన పుదుపేట్టై చిత్రంలో కొద్దిగా రాజకీయ సన్నివేశాలు చోటు చేసుకున్నా పూర్తి రాజకీయ నేపథ్యంలో నటించిన చిత్రం కొడి అని తెలిపారు. అదే విధంగా తొలి సారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదేనన్నారు. త్రిష, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ చాలా బాగా నటించారని అన్నారు. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ధనుష్ వెల్లడించారు. -
రజనీ వెనుకే ధనుష్
యువ నటుడు ధనుష్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన రజనీకి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇక రజనీ వెనుకే ధనుష్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేదో రాజకీయ అంశంగా భావించాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్ర వేనుకే ఆయన అల్లుడు ధనుష్ చిత్రం కొడి తెరపైకి రావడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. రజనీ చిత్రం కబాలి అంత కాకపోయినా ధనుష్ కొడి చిత్రం పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. కారణం ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం కావడమే. మరో విషయం ఏమిటంటే ధనుష్ ఇందులో తొలిసారిగా ద్విపాత్రాభినం చేయడం. తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న కొడి చిత్రంలో ఆయనకు జంటగా త్రిష, ప్రేమమ్ చిత్రం ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఎదునీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ తాజా చిత్రం కొడి. చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోనున్న కొడి చిత్రాన్ని రంజాన్ పండగ సందర్భంగా జూలైలో విడుదల చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.విశేషం ఏమిటంటే ఇంతకు ముందు ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి,మారి చిత్రాలు 2014, 2015 ఏడాదిలో రంజాన్ పండగ సందర్భం గా విడుదలై విజయాన్ని అందుకున్నాయి. అదే సెంటిమెంట్‌ను ధనుష్ తాన తాజా చిత్రం కొడికి వర్తింపజేయడానికి రెడీ అవుతున్నారని భావించవచ్చు.