ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసిందా? | Trisha Krishnan to romance Rajinikanth in Dhanush's next film? | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసిందా?

Published Tue, Nov 15 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసిందా?

ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసిందా?

ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి... ప్లీజ్ - హీరోయిన్ ఛాన్స్ కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే అమ్మాయిల నోట తరచూ వినిపించే మాట ఇది. అదృష్ట దేవత తలుపు తట్టిందా బంగారం లాంటి అవకాశం రానే వచ్చేస్తుంది. కొంతమంది అమ్మాయిలకు అట్టే ట్రై చేయకుండానే ఛాన్స్ వచ్చేస్తుంది. అందుకు ఓ ఉదాహరణ - త్రిష. ఒక్క ఛాన్స్ ఈజీగా దక్కించేసుకుని హీరోయిన్ అయిన తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చేసుకున్నారామె. ఇటు తెలుగులో, అటు తమిళంలో దాదాపు సీనియర్స్ నుంచి యంగ్‌స్టర్స్ దాకా స్టార్స్ అందరి సరసనా ఈ చెన్నై బ్యూటీ నటించారు. ఒక్క సూపర్ స్టార్ రజనీకాంతే బాకీ.

ఆయన సరసన నటించాలని త్రిషకు మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది. ‘‘రజనీ సార్‌తో కలసి నటించాలనే నా కోరిక ఎప్పుడు తీరుతుందో? సూపర్‌స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ ఎప్పుడొస్తుందో?’’ అని ఛాన్స్ దొరికిన ప్రతిసారీ మీడియా సాక్షిగా మనసులో కోరిక బయటపెట్టారామె. ఆ కోరిక త్వరలో నిజం కానుందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీ అల్లుడు ధనుష్ ఓ సినిమా నిర్మించనున్నారు.

అందులో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారట! మొదట్లో రజనీకి జోడీగా అమలా పాల్‌ను అనుకున్నారు. కానీ, చివరికి ఆ ఛాన్స్ చెన్నై సుందరి త్రిషకే వచ్చిందట. ఇటీవల తెలుగులో ‘ధర్మయోగి’గా విడుదలైన తమిళ సినిమా ‘కొడి’లో ధనుష్, త్రిష జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్‌లో రజనీకాంత్ సినిమా విషయమై ధనుష్‌ను త్రిష రిక్వెస్ట్ చేయడం, ఆయన ఓకే చేయడం జరిగాయేమోనని కోలీవుడ్ జనాలు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement