రజనీ వెనుకే ధనుష్ | Superstar Rajinikanth support with Dhanush | Sakshi
Sakshi News home page

రజనీ వెనుకే ధనుష్

Published Wed, May 11 2016 1:58 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

రజనీ వెనుకే ధనుష్ - Sakshi

రజనీ వెనుకే ధనుష్

యువ నటుడు ధనుష్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన రజనీకి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇక రజనీ వెనుకే ధనుష్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేదో రాజకీయ అంశంగా భావించాల్సిన అవసరం లేదు.
 
 రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్ర వేనుకే ఆయన అల్లుడు ధనుష్ చిత్రం కొడి తెరపైకి రావడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. రజనీ చిత్రం కబాలి అంత కాకపోయినా ధనుష్ కొడి చిత్రం పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. కారణం ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం కావడమే.
 
 మరో విషయం ఏమిటంటే ధనుష్ ఇందులో తొలిసారిగా ద్విపాత్రాభినం చేయడం. తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న కొడి చిత్రంలో ఆయనకు జంటగా త్రిష, ప్రేమమ్ చిత్రం ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఎదునీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ తాజా చిత్రం కొడి. చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
  త్వరలోనే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోనున్న కొడి చిత్రాన్ని రంజాన్ పండగ సందర్భంగా జూలైలో విడుదల చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.విశేషం ఏమిటంటే ఇంతకు ముందు ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి,మారి చిత్రాలు 2014, 2015 ఏడాదిలో రంజాన్ పండగ సందర్భం గా విడుదలై విజయాన్ని అందుకున్నాయి. అదే సెంటిమెంట్‌ను ధనుష్ తాన తాజా చిత్రం కొడికి వర్తింపజేయడానికి రెడీ అవుతున్నారని భావించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement