సూపర్‌స్టార్‌తో రొమాన్స్? | Romance with a superstar? | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌తో రొమాన్స్?

Published Tue, Nov 15 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

సూపర్‌స్టార్‌తో రొమాన్స్?

సూపర్‌స్టార్‌తో రొమాన్స్?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేయాలన్న చెన్నై చిన్నది త్రిష కోరిక నెరవేరనుందా? అది నెరవేరుతుందో? లేదో గానీ, అలాంటి ప్రయత్నాలు మాత్రం త్రిష ముమ్మరంగా చేస్తున్నట్లు కోడంబాక్కం వర్గాల తాజా సమాచారం. రజనీకాంత్‌తో మినహా త్రిష ఇతర ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారని చెప్పవచ్చు. సూపర్‌స్టార్‌తో నటించాలన్నది ఆ అమ్మడి చిరకాల కోరిక. తన సహ నటీమణులైన నయనతార, శ్రీయ, అనుష్క, చివరికి రాధికాఆప్తే, ఆంగ్ల భామ ఎమీజాక్సన్ కూడా రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని అందుకున్నారు. తనకెందుకు అలాంటి అవకాశం రాలేదన్న ప్రశ్నను త్రిష చాలా సార్లు వేసుకున్నారట.

కబాలి చిత్రంలో రజినీకాంత్‌తో జత కట్టే అవకాశం తనకు లభిస్తుందని ఈ బ్యూటీ ఆశించిదట. అరుుతే ఆ అవకాశం నటి రాధికాఆప్తేను వరించింది. ఎప్పటికై నా సూపర్‌స్టార్‌తో నటించి తీరతానన్న నమ్మకంతో ఉన్న త్రిష తాజాగా తన కోరికను నెరవేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో నటించిన త్రిష తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా కబాలి చిత్ర కాంబినేషన్ రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సంచలన చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నారు. దీంతో ఈ చిత్రంలో రజినీకాంత్‌తో రొమాన్‌‌స చేసే అవకాశం కోసం త్రిష ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో కథానాయకిగా అవకాశం లేకపోతే అతిథి పాత్రలోనైనా నటించడానికి రెడీ అంటున్నారట. త్రిష ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. కాగా ప్రస్తుతం హీరోరుున్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినీని పూర్తి చేసే పనిలో ఉన్న త్రిష తాజాగా అరవిందస్వామికి జంటగా చతురంగవేటై్ట-2, విజయ్‌సేతపతి సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement