
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. పీఏ పల్లి మండలం చినకమర్రిగేటు వద్ద బైక్పై వెళ్తున్న నలుగురు యువకులను వేగంగా వచ్చిన ఇన్నోవా ఢీకొంది ఈ దుర్ఘటనలోనలుగురూ అక‍్కడికక్కడే మృతి చెందారు. వీరంతా మల్లేపల్లి నుంచి మునావత్ తండాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను లక్పతి(35), నెహ్రు(25), భాస్కర్(26) శివ(22)లుగా గుర్తించారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ముందు వెళుతున్న ఇన్నోవాను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. ఇకమృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.