
సాక్షి ముంబై: మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న తవేరా కారును ఓ ట్రక్కు ఢీకొనడంతో 11 మంది మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు నలుగురు మహిళలున్నారు. అర్ని పోలీసు స్టేషన్ పరిధిలోని కోస్‌దాని ఘాట్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులు నాందేడ్‌లోని గురుద్వారాను దర్శించుకునేందుకు తవేరాలో బయల్దేరినట్లు తెలిసింది. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో తవేరా ముందు భాగం నుజ్జునుజ్జయింది. క్షణాల్లోనే బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment