కుప్పకూలిన విమానం..నలుగురి మృతి | Four killed in plane crash in Houston From Seema Hakhu Kachru | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన విమానం..నలుగురి మృతి

Published Sat, Jul 9 2016 11:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

Four killed in plane crash in Houston From Seema Hakhu Kachru

హూస్టన్: అమెరికాలో ఓ చిన్నవిమానం కుప్పకూలింది.  ఈ దుర్ఘటనలో  నలుగురు మరణించారని  ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్  ప్రకటించింది.   నలుగురితో బయలుదేరిన సింగిల్ ఇంజీన్ పీఏ- 32  ప్రయివేట్ హూస్టన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జనావాసాలపై కుప్పకూలింది. శుక్రవారం సాయంత్రం వెస్ట్ హూస్టన్ విమానాశ్రయంనుంచి గాల్లోకి లేచిన కొద్ది సేపటికే  నేలపై పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది. అయితే  మంటల్లో  చిక్కుకున్న విమానంనుంచి చిన్నచిన్న పేలుళ్లను గమనించామని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదని, ప్రమాదానికి కారణాలను విచారిస్తున్నామని  పోలీసు అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement