రియో డిజనీరో: బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ విషాద ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న 10 మంది మృతి చెందారు. విమానం పడిన చోట భవనాల్లో ఉన్న మరో పదిహేను మందికి గాయాలయ్యాయి. టూరిస్టు పట్టణం గ్రామడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానం తొలుత ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టి తర్వాత అందులో కింది ఫ్లోర్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌లు అమ్మే షాపులోకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్నవారంతా మృతిచెందారు. గ్రామడో పర్వత ప్రాంతంలోని పాపులర్ టూరిస్టు డెస్టినేషన్. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment