
సాక్షి, న్యూఢిల్లీ: హానర్ కొత్త మొబైల్‌ను లాంచ చేసింది. ఆర్టీఫిషీయల్ ఇంటిలిజెన్స్ వ్యూస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను అందించిన వెంటనే కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. మిడ్ సెగ్మెంట్‌లో హానర్ 9 లైట్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన వాటి ధరలు ఇలా ఉన్నాయి. 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా, 64జీబీ వేరియంట్ రూ.14,999 గా నిర్ణయించింది. జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా ఇది విక్రయానికి లభిస్తుంది. గ్రే, బ్లూ, బ్లాక్ రంగుల్లో ఇది లభ్యం. కాంపాక్ట్ బాడీ, డ్యుయల్ కెమెరా 0.25 సెకన్లలో అన్‌లాక్ అయ్యే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత రియల్-టైమ్ సెన్స్‌ఆబ్జెక్ట్ రికగ్నిషన్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలని కంపెనీ ప్రకటించింది.
హానర్ 9 లైట్ ఫీచర్లు
5.65 అంగుళాల ఫుల్ హెచ్‌డీ బెజెల్ లెస్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
కిరిన్ 695 ఆక్టా కోర్ ప్రాసెసర్
3 జీబీ/4జీబీ ర్యామ్
32/64జీబీ స్టోరేజ్
13+2 ఎంపీ రియర్ కెమెరా
13+2 ఎంపీ సెల్ఫీ కెమెరా
256 జీబీ దాకా విస్తరించుకునే సౌలభ్యం
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
9 Lite With Launched in India
Comments
Please login to add a commentAdd a comment