తెలంగాణలో ఆదివారం జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వరంగల్ జిల్లాలోని రఘునాధపల్లి మండలం గోవర్థనగిరిలో ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఘటనలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం చంద్రాయణిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
Published Sun, Nov 29 2015 5:27 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement