విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు టాప్టెన్లో చోటు దక్కించుకోగా.. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఓ విద్యార్థి టాప్ టెన్‌లో నిలిచాడు.
టాప్టెన్లో నిలిచిన విద్యార్థులు వీరే..
మొదటి ర్యాంక్- వంశీకృష్ణారెడ్డి
రెండో ర్యాంక్- లక్ష్మీనారాయణ
మూడో ర్యాంక్- విఘ్నేష్ రెడ్డి
నాలుగో ర్యాంక్- ప్రశాంత్ రెడ్డి
ఐదో ర్యాంక్- గౌతమ్
ఆరో ర్యాంక్- చేతన్ సాయి
ఏడో ర్యాంక్- సాయితేజ
ఎనిమిదో ర్యాంక్- జార్జ్
తొమ్మిదో ర్యాంక్- సంజీవ్
పదో ర్యాంక్- జయకృష్ణసాయి
ఫలితాల్లో టాప్టెన్లో నిలిచిన వారంతా అబ్బాయిలే కావటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం ఉత్తీర్ణత తగ్గింది. నీట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మెడికల్ ఫలితాలను నిలిపేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.