అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ, హత్యలు ఆందోళన కలిగిస్తోంది.. అండర్ ట్రయల్ ఖైదీని తోటి ఖైదీని హత్య చేసిన సంఘటన కలకలం రేపింది
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ, హత్యలు ఆందోళన కలిగిస్తోంది. అండర్ ట్రయల్ ఖైదీని తోటి ఖైదీని హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. హై సెక్యూరిటీ వుండే జైలు నెం.8 లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లో ఉండగానే దీపక్ (29) పై నలుగురు ఖైదీలు దాడి చేసి దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. హత్య, దొంగతనం లాంటి కేసుల్లో దోషిగా తేలిన దీపక్ 2008 సం.రం నుంచి తీహార్ జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉంటున్నాడు
కిటికీ ఊచలను మారణాయుధాలు మలుచుకున్న ఖైదీలు పథకం ప్రకారం దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. మన్ప్రీత్, జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న సత్పాల్ సహా మరో ఇద్దరికి ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకడైన మన్ప్రీత్ గతంలో ఒక ఖైదీని హత్య చేసినట్టుగా జైలు పీఆర్వో ప్రసాద్ తెలిపారు. వీరు తరచూ జైలు నిబంధనలను అతిక్రమిస్తూ గొడవలకు దిగేవారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ సంఘటనపై హరినగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశాన్నారు