అధికారుల తప్పులు, ఖైదీల తిప్పలు
విశ్లేషణ
దురుద్దేశంతో అక్రమంగా ఎవరిని నిర్బంధించినా నేరమే. జైల్లో అధికారులకు దురుద్దేశం ఉందని అనడం కష్టమే. కానీ పొరబాటున, నిర్లక్ష్యం వల్ల, తప్పుడు లెక్కలవల్ల జైల్లో నిర్బంధం హద్దు మీరితే ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందే.
ఇచ్చిన చెక్కు చెల్లని నేరానికి ఓం ప్రకాశ్ గాంధీకి ఒక సంవ త్సరం సాధారణ జైలు శిక్ష విధించారు. 23 నవంబర్‌న అరెస్టు అయిన నాటి నుంచి 24 డిసెంబర్ 2010న బెయిల్‌పైన విడుదలయ్యే దాకా బందీగా ఉన్నారు. 26 నవంబర్ 2013న కోర్టు విధించిన శిక్ష ప్రకారం 24 అక్టోబర్ 2014న అతను విడుదల కావలసి ఉంది. ఖైదీకి ప్రవర్తన ఆధారంగా కారాగార శిక్షలో తగ్గింపు (రెమిషన్) ఇస్తారు. ఓం ప్రకాశ్‌కు కూడా రకరకాల రెమిషన్ ఇచ్చారు. వాటి వివరాలకు సంబంధించి అనేక ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా తీహార్ జైలు నుంచి సమాచారం సంపాదించారు.
ఆయన లెక్క ప్రకారం ఆగస్టు 2వ తేదీన విడుదల కావలిసి ఉండింది. మొత్తం 83 రోజుల రెమిషన్ ప్రకటిస్తే, అందులో జైలు నియమాల ప్రకారం 37 రోజులు, ప్రభుత్వం ఇచ్చిన 30 రోజులు సూపరింటెండెంట్ ఇచ్చిన రెమిషన్ 15 రోజులు డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ఒక రోజు రెమిషన్ తనకు రావలసి ఉందని వాదించారు. ఆ లెక్కన తనను ఆగస్టు 2న విడు దల చేయాలన్నారు. కానీ ఆయనను 15 ఆగస్టున విడు దల చేశారు. 14 రోజులపాటు తనను అనవసరంగా బంధించారని అది అక్రమమని గాంధీ వాదించారు.
హర్యానా ఫరీదాబాద్ ఒకటో తరగతి న్యాయాధి కారి ముందున్న కేసులో బెరుుల్ ఉందో లేదో తెలుసు కునే దాకా జైల్లోనే ఉంచవలసి వచ్చిందని తీహార్ జైలు అధికారులు ఒక ఆర్టీఐ జవాబిచ్చారు. మరొక కేసులో అరెస్టు వారంటు ఉందో లేదో తెలుసుకోవడం విడుదల తేదీకన్నా ముందే జరగాలని, ఆ వివరాలు తెలియడానికి రెండు మూడు రోజులు పడితే అంతకాలం తనను బంధించడం న్యాయం కాదని వాదించారు. అక్రమ నిర్బంధానికి నష్ట పరిహారం ఇప్పించాలని దరఖాస్తు దారుడు కోరారు.
దరఖాస్తుదారుకు లభించిన రెమిషన్ ఇవ్వకుండా నిర్బంధించినట్టు తేలితే దానికి పరిహారం ఏమిటి? ఎవరిస్తారు? బాధ్యులెవరు? విధివిధానాలు ఏమిటి? అని అడిగారు. తమ దగ్గర దీనికి ఏవిధానమూ లేదని, ఒకవేళ ఎవరైనా అక్రమ నిర్బంధానికి గురైనారని అను కుంటే కోర్టుకు వెళ్లి పరిష్కారం కోరాలని, ఆ ఆదేశాల మేరకు తాము వ్యవహరిస్తామని జైలు అధికారులు తెలి పారు.
ఒకవేళ లెక్కలో తప్పు వచ్చినా, రెమిషన్ ఇవ్వ వలసిన దానికన్న తక్కువ ఇచ్చినా, నిర్లక్ష్యంతో లెక్కిం చడం వల్ల పొరబాటు జరిగినా లేకపోతే ఎవరైనా కావా లని తప్పుడు లెక్కలు సృష్టించినా, అటువంటి ఫిర్యా దులు వచ్చినపుడు ఎవరు వింటారు? ఏ అధికారికి దర ఖాస్తు పెట్టుకోవాలి? ఆ విధానం గురించి తమంత తామే అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఎందుకు ప్రకటించబోరు? అనే ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి.
న్యాయ విధానాల ద్వారా తప్ప మరొక రకంగా జీవన హక్కును స్వేచ్ఛా జీవనాన్ని హరించడానికి వీల్లే దని ఆర్టికల్ 21 కింద జీవన స్వేచ్ఛా హక్కును మన సంవిధానం ప్రసాదించింది. శతాబ్దాల నుంచి వ్యవస్థా పితమైన ప్రక్రియ పరిధిలోకి సత్ప్రవర్తనకు శిక్షాకాలం తగ్గించడం, గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శిక్ష తగ్గించడం కూడా వస్తాయి. ఒకవేళ శిక్షా కాలం తగ్గింపు లెక్కల్లో ఏ కారణంగానైనా తప్పు ఉంటే జీవన హక్కు స్వేచ్ఛా హక్కు భంగపడినట్టే.
సెక్షన్ 4 కింద ఖైదీల హక్కులకు సంబంధించిన వివరాలు స్వయంగా ఇవ్వవలసిన బాధ్యత జైలు అధికా రులపైన ఉంది. ఈ బాధ్యత నిర్వహించకపోతే ఆర్టీఐ కింద ఎవరైనా అడిగినప్పుడైనా సమాచారం ఇవ్వాలి. ఈ కేసులో ఖైదీ, బాధితుడూ అయిన సమాచార అభ్యర్థికి అడిగే హక్కు ఉంది, అధికారులకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు భంగపడినప్పుడు, దానికి కారకులు ప్రభుత్వ ఉద్యోగులైతే, ప్రభుత్వం పరోక్షంగా బాధ్యత వహించి పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టులు అనేక సందర్భాలలో పరిహా రాలు చెల్లించాలని ఆదేశించాయి. మొదట్లో రాచకా ర్యాల నిర్వహణలో నష్టాలు జరిగితే జనం భరించా ల్సిందే తప్ప ప్రభుత్వాలకు ఏ బాధ్యతా ఉండదనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.
ప్రభుత్వ బాధ్యతను నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. పీనల్ కోడ్ ప్రకారం తప్పుడు నిర్బంధం నేరం అవుతుంది. దురుద్దేశంతో అక్రమంగా ఎవరిని నిర్భంధించినా నేరమే. జైల్లో అధికారులకు దురుద్దేశం ఉందని అనడం కష్టం అవుతుంది. పొరబాటున, నిర్లక్ష్యంవల్ల, తప్పుడు లెక్కలవల్ల జైల్లో నిర్బంధం హద్దు మీరితే ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందే.
అధికారులు విచారణకు హాజరు కాకుండా అభ్యర్థిని ఖర్చులపాలు చేసినందుకు వేరుు రూపాయలు, రోజుకు 2,500ల చొప్పున నాలుగు రోజుల అక్రమ నిర్బంధానికిగాను పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. CIC/SA/A/ 2016/000884, (how&cause notice) కేసులో 27. 9.2016 న సీఐసీ తీర్పు ఆధారంగా.
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
- మాడభూషి శ్రీధర్
ఈమెయిల్: professorsridhar@gmail.com